రాష్ట్రీయం

రైల్వే యార్డులో బోగీలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజీపేట: కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేయార్డులో నిరుపయోగంగా ఉన్న ప్యాసింజర్ రైలు బోగీలు దగ్ధమయ్యాయి. కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని సైడింగ్ యార్డులో నిరుపయోగంగా ఉన్న ప్యాసింజర్ రైలు బోగీలను నిలిపి ఉంచారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఆదివారం వేకువజామున 2గంటల అనంతరం సైడింగ్‌యార్డులో నిలిపి ఉన్న రైలు బోగిల్లో మంటలు రావడాన్ని రైల్వే సిబ్బంది గమనించారు. రైల్వే సిబ్బంది వెంటనే స్టేషన్ మేనేజర్, ఆర్ఫీఎఫ్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. గంటసేపటి తర్వాత ఫైర్ ఇంజన్ ప్రమాద స్థలానికి చేరుకుంది. ఆలోపే ప్యాసింజర్ రైల్లోని రెండు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.
దగ్ధమైన బోగీలు ఉన్న యార్డు పక్కనే డీజిల్ ట్యాంకర్లు ఉన్న గూడ్స్ రైలు ఉండటంతో ప్యాసింజర్ రైలు బోగీలను డీజీల్ లోకోషెడ్‌కు తరలించారు
అగ్నిప్రమాదంపై విచారణ
ఘటనపై ఆర్‌పీఎఫ్ సికింద్రాబాద్ కమిషనర్ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఆదివారం కాజీపేట రైల్వే స్టేషన్‌లో దగ్ధమైన బోగిలను, ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఆర్పీఎఫ్ కాజీపేట ఇన్స్‌పెక్టర్ వీరన్నను, రైల్వే సిగ్నల్ సిబ్బందిని, స్టేషన్ మాస్టర్‌ను ప్రమాదానికి దారితీసిన అంశాలపై వివరణ అడిగారు. రైలు బోగీలు చలిమంటల వల్ల కాలినాయా, ఎవరైనా కాల్చారా, సిగరేట్, చెత్త కాల్చడం వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఆర్‌పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ వీరన్న తెలిపారు. ఘటనపై రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో సంచలనం రేపింది. నిత్యం ప్రయాణికులతో ఉండే రైల్వేస్టేషన్‌లోసమీపంలోని యార్డులో ప్రమాదం జరుగడంతో రైల్వే సిబ్బంది కంగుతిన్నారు. ఉన్నతాధికారులు దీన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ప్రమాద సమయంలో రైల్వేస్టేషన్‌లో ఉన్న సిబ్బంది, రాత్రి విధుల్లో ఉన్న ఆర్‌పీఎఫ్ సిబ్బందిని, రైల్వేఫ్లాట్‌ఫారంపై ఉన్న హాకర్లను, సిగ్నలింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఆర్‌పీఎఫ్, రైల్వే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెనుప్రమాదం తప్పిందా?
ప్యాసింజర్ రైలు ఉన్న యార్డు పక్కనే రైల్వే గూడ్సు డీజిల్‌బోగీలు ఉన్నాయి. ఈ బోగీలకు మంటలు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. గూడ్సు బోగీల పక్కనే కాజీపేట రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారాలు ఉన్నాయి. మంటలను రైల్వే సిబ్బంది గుర్తించినప్పటికీ ఫైర్ ఇంజన్ వచ్చే లోపే రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు మరో యార్డుకు వ్యాపించకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే బోగీలు తగలబడటంతో ఆర్‌పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.

చిత్రాలు.. బోగీలో వ్యాపించిన మంటలు
*పూర్తిగా దగ్ధమైన బోగీల లోపలి భాగం