తెలంగాణ

హామీల అమలుకు కేసీఆర్ స్పీడ్...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 17: ఎన్నికల హామీల అమలు దిశగా సీఎం కేసీఆర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో హామీల అమలుతో ప్రయోజనం పొందనున్న ప్రజల్లో, లబ్ధిదారుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి మునుగోడు, ఆలేరు నియోజకవర్గాల ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీల మేరకు గట్టుప్పల్ గ్రామాన్ని నూతన మండలంగా, గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేందుకు ఆదేశాలివ్వడంతో ఈ ప్రాంత ప్రజల్లో సంబరాలు వ్యక్తమయ్యాయి. సుదీర్ఘంగా తాము సాగించిన ఉద్యమాలను గుర్తించి కేసీఆర్ తమ కోర్కేలను నెరవేర్చడం పట్ల వారు అనందోత్సహాల్లో మునిగారు.
బతుకమ్మ చీరల సందడి
పెండింగ్‌లో ఉన్న బతుకమ్మ చీరల పంపిణీకి, 57ఏళ్లకే ఆసరా పింఛన్ల మంజూరుకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని వేలాది మంది లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 19నుండి క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలతో పాటు పెండింగ్‌లో ఉన్న బతుకమ్మ చీరల పంపిణీకి కేసీఆర్ ఆదేశాలిచ్చారు.
తెలంగాణలో 96లక్షల చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయగా ఒక్క నల్లగొండ జిల్లాలో 5.22లక్షల మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేయనుండగా, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం చీరల పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు 57ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ల మంజూరు దిశాగా తెలంగాణ వ్యాప్తంగా వయో పరిమితి కుదింపుతో 17లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరవుతాయని అధికారుల లెక్కలు వేస్తున్నారు. తగ్గించిన వయో పరిమితి మేరకు అర్హులైన వారి నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని, పరిశీలన పిదప కొత్త పింఛన్‌దారులకు, పాత పింఛన్‌దారులకు కూడా టీఆర్‌ఎస్ హామీ ఇచ్చినట్లుగా 2016రూపాయల ఆసరా పింఛన్‌ను వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి అందించాలని కేసీఆర్ నిర్ణయించడంతో ఒక్కో జిల్లాలో ఆసరా పింఛన్‌దారుల సంఖ్య వేలల్లో పెరుగనుంది. అలాగే మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై సైతం సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలివ్వడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో వాటి పనులు ముమ్మరం కానున్నాయి. ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకం పనులు, ఉదయ సముద్రం ఎత్తిపోతల, వాటి రిజర్వాయర్లు, కాలువల పనులు, అలాగే కాళేశ్వరం పరిధిలోని గంథమల్ల, బస్వాపురం రిజర్వాయర్‌ల పనులు, కాలువల పనులు, మూసీ కాలువల విస్తరణ పనులు ఇక వేగం పుంజుకోనున్నాయని భావిస్తున్నారు.
యాదాద్రి ఆలయ అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి స్వయంభూల దర్శనం కల్పించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనుల్లో వేగం పెరుగనుంది. అటు యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు పొడగింపు పనులు కూడా ఇక జోరందుకోనున్నాయని తెలుస్తుంది. వీటితో పాటు బీబీనగర్‌లో ఏయిమ్స్, దామరచర్లలో యాదాద్రి థర్మల్ ఫ్లాంట్ పనులు, జిల్లాల్లో ఐటీ పార్కుల పనులతో పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో నియోజకవర్గాల స్థానిక సమస్యలపై ఇచ్చిన హామీల అమలు పురోగతి దిశగా సాగనుండటం సహజంగానే ఈ ప్రాంతా వాసుల్లో హర్షాతీరేకాలను కల్గిస్తుంది.

చిత్రాలు.. ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు *మిషన్ భగీరథ పనులు *పింఛనుదారులు