తెలంగాణ

ఇక జిల్లాలపై కేటీఆర్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: టీఆర్‌ఎస్‌ను వందేళ్ళు తిరుగులేని శక్తిగా పటిష్టం చేస్తానని చెప్పిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కే. తారక రామారావు ఇక జిల్లా పర్యటనలపై దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీకి సంపూర్ణమైన నిర్మాణం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలోగా పార్టీకి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటనగా ఈ నెల 20న వరంగల్ జిల్లాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ అర్బన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆ జిల్లా రూరల్, అర్బన్ ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చించనున్నారు. వారికి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్ధేశం చేయనున్నారు.

చిత్రం.. కేటీఆర్‌ను అభినందిస్తున్న హరీశ్‌రావు