తెలంగాణ

మానుకోట ఎంపీ అభ్యర్థిగా నేనంటే నేను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,డిసెంబర్ 17: అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్టస్రమితి కొట్టిన దెబ్బకు కాంగ్రెస్‌పార్టీకి దిమ్మతిరిగిపోయింది. కార్యకర్తలు, నాయకులు ఆ షాక్‌నుండి ఇంకా తేరుకోక ముందే మానుకోట పార్లమెంట్ టికెట్ కోసం మళ్లీ అంతర్గత పోరు మొదలైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మానుకోట స్థానం నుండి నేనంటే నేను అని మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్‌లు అప్పుడే ప్రకటనల యుద్ధం ప్రారంభించారు. అంతర్గత టికెట్‌ల పోరు మూలంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వాకిట బొక్కబోర్లపడి ఓటమి మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ అంతర్గత గ్రూపు రాజకీయాలను ప్రొత్సహించే విధంగా టికెట్‌వార్‌కు తెరతీయడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీచేసిన బలరాంనాయక్ ఇప్పుడు తాజాగా పార్లమెంట్ బరిలోనూ తాను అభ్యర్ధినంటూ సోమవారం ప్రకటన చేయడంతో ప్రస్తుతం మహబూబాబాద్ వ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతుంది. ఇటీవలే ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్ మానుకోటలో విలేఖరుల సమావేశం నిర్వహించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నానని ఇకపైన ఉంటే ఢిల్లీలో లేదంటే మహబూబాబాద్‌లోనే తాను ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా బలరాంనాయక్ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్ధినంటూ చెబుతున్నాడు.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని పంచాయితీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, సహకార సంఘాలు గెలుచుకునే దిశగా పావులు కదపాల్సిన నాయకులే అందుకు భిన్నంగా తమ టికెట్ అంశాన్ని తెరపైకి తేవడం కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. అధికార పార్టీని ఢీకొని స్థానిక విజయాలు సాధించాలంటే కచ్చితంగా అధిష్టానం ఆశీస్సులు అన్నిరకాల సహాయ సహకారాలు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వాదన. ఎవరు సహకరిస్తే వారికే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సహకారం ఉంటుందని పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి.