ఆంధ్రప్రదేశ్‌

సీమలో వజ్రాల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జూన్ 7: వర్షాలు కురుస్తుండడంతో సీమలో వజ్రాల వేట ప్రారంభమైంది. వజ్రం దొరికితే తమ ఆదృష్టమే మారిపోతుందని జనం పొలాల వెంట పరుగులు తీస్తున్నారు. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని జొన్నగిరి, తుగ్గలి, రాతన పెరవలి గ్రామాల్లో వజ్రాల వేట ముమ్మరమైంది. సూదూర ప్రాంతాల నుంచి కుటుంబాలకు కుటుంబాలు వలస వచ్చి ఇక్కడే మకాం వేసి వజ్రాల కోసం కళ్లు చాటంత చేసుకుని మరీ వెతుకుతున్నాయి. రోజు వర్షం కురుస్తుండడంతో ఏ పొలంలో చూసిన గుంపులుగుంపులుగా వజ్రల కోసం తిరిగే మహిళలు, పిల్లలు కనిపిస్తున్నారు. ఈ గ్రామాల్లో వజ్రాలవేట ప్రతినిత్యం కొనసాగుతోంది. ఇప్పటికే రూ.20 లక్షల విలువ చేసే వజ్రాలు దొరికినట్లు సమాచారం. మేనెలాఖరు నుంచే వర్షాలు కురవడంతో ఆయాగ్రామాల్లో వజ్రాల వేట ఆరంభమైంది. జొన్నగిరి, గిరిగేట్ల పొలాల్లో ఓ మహిళకు వజ్రం దొరికినట్లు జనం చెప్పుకుంటున్నారు. దాన్ని ఆమె పెరవలి వ్యాపారులకు రూ.3 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. జొన్నగిరి పొలాల్లో ఓ పిల్లవాడికి చిన్నపాటి వజ్రం దొరికినట్లు తెలిసింది. వర్షాలు పడినప్పుడు ఎర్రమట్టి పొలాల్లోని రాళ్లు బాగా కనిపిస్తాయి. అప్పుడు వజ్రాలు సైతం బయటపడుతాయి. వర్షాలు పడితేచాలు ఈ గ్రామాల్లో వజ్రాలవేట ముమ్మరమవుతుంది. అయితే దొరికిన వజ్రాలు దొరికినట్లు దళారుల చేతుల్లోకి వెళ్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. గత ఏడాది జొన్నగిరిలో 8 వజ్రాలు దొరికినట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, గిద్దలూరు, గుంతకల్లు, అనంతపురం, రాయచూరు, మహబూబ్‌నగర్, గద్వాల, అచ్చంపేట తదితర ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు.