తెలంగాణ

చేపమందు పంపిణీకి మూడంచెల బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే చేప మందు పంపిణీ సందర్భంగా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేప మందుకోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భద్రత కల్పించే విధంగా తగు చర్యలు తీసుకున్నామని, 1200 మంది సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. బత్తిని సోదరుల ఆధ్వర్యంలో సుమారు నాలుగు లక్షల మందికి చేప మందు వేయనున్నారని, రెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు.
రంజాన్‌కు 10 కోట్లు
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 7: రంజాన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రంజాన్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష జరిపారు. రంజాన్ కోసం ప్రతి జిల్లాకు 50లక్షల రూపాయల చొప్పున మొత్తం పది కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. రంజాన్ మాసంలో ముస్లింలకు వస్త్రాలు, రంజాన్‌కు అవసరం అయిన సామగ్రిని అందజేయనున్నట్టు చెప్పారు. మసీదుల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం పనులు చూడాలని అధికారులను ఆదేశించారు.
హైకోర్టులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ పిటిషన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 7: తనకు భద్రత పెంచాలని, రాష్ట్రప్రభుత్వం నుంచి ముప్పు ఉందంటూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసేందుకు వారం రోజులు కావాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కోరింది. అనంతరం ఈ విషయమై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.