ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఇంటికీ వంట గ్యాస్ కనెక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 8: రెండేళ్ల తమ పరిపాలనలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్టు వచ్చే ఏడాదికల్లా ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బుధవారం మహాసంకల్పం సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి ఆయన 4,800 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నవనిర్మాణ దీక్ష నాటి నుండి వారం రోజులుగా చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం వచ్చిందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న వనరులతోనే ఉత్తమ ఫలితాలు చూపించిన తన పరిపాలనా విధానాన్ని గత పాలకుల నిర్వాకాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధిపై చర్చ జరుగుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు లక్ష్యసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని కుప్పకూలిన వ్యవస్థలను చక్కదిద్ది పరిపాలన గాడిలో పెట్టామని రెండేళ్లలో రెండంకెల వృద్ధి సాధించామని పేర్కొన్నారు. అధికారం చేపట్టే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 7రోజులు, 24గంటలు విద్యుత్ పథకంతో ఏడాదికే మిగులు విద్యుత్‌ను సాధించటం జరిగిందన్నారు. ప్రతి ఊరుకు విద్యుత్ సదుపాయం కల్పించామని వివరించారు. అలాగే వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. కరెంట్ కనెక్షన్, వంట గ్యాస్ కనెక్షన్, మంచినీటి కుళాయి, కేబుల్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఉండాలన్న లక్ష్యంతో ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి పొలానికి సాగునీరు లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదువేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం తమ ధ్యేయమని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్న సంకల్పంతో విద్యుత్ భద్రత, నీటి భద్రత, గ్యాస్, ఆహార, పశువులకు పశుగ్రాస భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగత వౌలిక వసతులు, సామాజిక వౌలిక వసతులు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, వర్మీ కంపోస్టు యూనిట్లు నెలకొల్పటం ద్వారా సేంద్రీయ ఎరువుల కొరత లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రణాళికా సాయంతో వార్షిక లక్ష్యాలను నిర్దేశించుకుని పూర్తిచేయాలని కోరారు. వ్యవసాయం, నీటిపారుదల, విద్యా, వైద్య అన్ని రంగాలను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటికే 8శాతం వర్షపాతం ఎక్కువ పడిందంటూ భూగర్భ జల మట్టం 12.93 మీటర్లు ఉండటంపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. పెరిగిన భూగర్భ జల మట్టం 90 టిఎంసిలతో సమానమని, నెలాఖరుకల్లా 200 టిఎంసిల భూగర్భ జలం అందుబాటులోకి రాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నీటి భద్రత కోసం సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని కోరారు. వ్యక్తిగత ఆదాయాలు పెంచి పేదరికంపై తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలకు తగిన నీటిని అందించడం ద్వారా నీటి భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని రకాల పశుగ్రాసం అందుబాటులో ఉంచి పాల దిగుబడి పెంచడం ద్వారా గ్రామీణ కుటుంబాల రాబడి పెంచుతామని పేర్కొన్నారు. వ్యక్తిగత ఆదాయాలు పెంచటం ద్వారా పేదరికంపై గెలుపు సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.