తెలంగాణ

ఏకగ్రీవాల వేలం పాటలు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో వేలం ద్వారా జరిగే ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయాలని తెలంగాణ ఎన్నికల నిఘా కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల నిఘా కమిటీ ప్రతినిధులు ఎం. పద్మనాభరెడ్డి, రావు చెలికాని, బండారు రాంమోహనరావు, జనే్నపల్లి శ్రీనివాసరెడ్డి, నాగేంద్రస్వామి, వివి రావు, రోజా తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డిని గురువారం ఎస్‌ఈసీ కార్యాలయంలో కలిసి కలిసి చర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చూడాలని ప్రతినిధి బృందం కోరింది. ఎన్నికల కమిషనర్‌కు ఎన్నికల నిఘా కమిటీ ఒక మెమోరాండం ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే మండల, జిల్లాస్థాయి ఎన్నికల నిఘా కమిటీలు సంబంధిత అధికారుకు తెలియచేస్తాయన్నారు. తమ కమిటీ ఇచ్చే సమాచారంపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎన్నికల నిఘా కమిటీకి పూర్తిగా సహకారం అందిస్తామని, ఈ కమిటీ ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన మెమొరాండంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలివే...
* వేలం పాటల ద్వారా ఏకగ్రీవంగా జరిగే ఎన్నికలను ఆపాలి.
* సర్పంచ్‌లు, గ్రామస్థుల కొనుగోలును నివారించాలి.
* గ్రామాభివృద్ధి కమిటీలు,కుల సంఘాలకు ఏకగ్రీవం కోసం అభ్యర్థులు ఇచ్చే తాయిలాలపై విచారణ చేసి ఆపుచేయించాలి.
* ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక బహుమతుల, పదిలక్షల రూపాయల నగదును విచారణ చేసిన తర్వాతనే విడుదల చేసేలా చూడాలి.
* ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ది నిధులనుండి ఇచ్చే డబ్బును కూడా విచారణ చేసిన తర్వాతనే విడుదలచేసేలా చూడాలి.
* గత ఎన్నికల సమయంలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించకపోతే, వారిపై అనర్హత వేటు వేసి, వారి పేర్లతో ఉన్న జాబితాలను రిటర్నింగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలి.
చిత్రం..ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి లేఖ అందిస్తున్న నిఘా కమిటీ నేతలు