తెలంగాణ

‘దర్పన్’తో తప్పిపోయిన పిల్లల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ పోలీస్ శాఖ వినూత్నమైన టెక్నాలజీతో తప్పిపోయిన పిల్లల్ని గుర్తించడానికి ‘దర్పన్’ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇటీవల తెలంగాణ పోలీసులు 350 మంది తప్పిపోయిన పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. శుక్రవారం మంచిర్యాల సబ్ డివిజనల్ పోలీసులు తప్పిపోయిన బాలుడ్ని మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. ‘దర్పన్’ సిస్టమ్‌తో బాలుడి ఫొటోను అప్‌లోడ్ చేయగా అతడు అలహాబాద్ వారణాసిలో తప్పిపోయినట్లు సమాచారం వచ్చింది. దీంతో అక్కడి పోలీస్ అధికారులతో సంప్రదించారు. బాలుడు ఫొటో సిరిచూడగా అలహాబాద్ వాసి అని తేలింది. బాలుడు సదానంద(15)గా గుర్తించారు. 2016లో సదానంద తప్పిపొయినట్లు వారణాసి పోలీసులు కేసు నమోదు చేశారు. సదానంద తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ‘దర్పన్’ సేవలను పిల్లల తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని తీర్చనుందని పోలీసు అధికారులు అన్నారు.