తెలంగాణ

పురావస్తు భవనాలకు కొత్త హంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: రాజధాని నగరంలోని పురావస్తు భవనాలకు అనుమతించిన మేరకు మరమ్మతులు చేపట్టాలని, విద్యుద్దీపకాంతులతో వాటిని నవీకరించాలని మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్ళిశ అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని సంబంధించి సమగ్ర ప్రణాళికలతో రావాలని ఆయన సూచించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం, పరిశుభ్రం చేయడం, విద్యుద్దీపాలతో అలంకరించడం చేయాలని, తద్వారా నగరానికి కొత్త శోభ వస్తుందని పేర్కొన్నారు. గత నెల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన జరిగిన భేటీలో పురాతన భవనాల పునరుజ్జీవన చర్యలపై విస్తృతంగా చర్చించారు. బోధన్‌లో దేవల్ మసీదు, నిజామాబాద్‌లో ఖిలా రామాలయం, డిచ్‌పల్లిలో రామమందిరం, జగిత్యాల కోట, కోలన్‌పాక్‌లో జైన్ మందిరం తదితర ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవల్సి ఉందని అన్నారు.