తెలంగాణ

పంచాయతీలకు రూ. 1500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: త్వరలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత పంచాయితీల అభివృద్ధికి 1500 కోట్ల రూపాయిలతో నిధిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నిధులను ఆర్ధిక సంఘం ద్వారా పంచాయతీలకు కేటాయిస్తారు. ఇతర శాఖల ద్వారా స్థానిక సంస్థలకు రావల్సిన బకాయిల గురించి ఆయా శాఖల అధిపతులతో సమావేశాన్ని నిర్వసించి అలాంటి బకాయిలను పంచాయతీలకు చేరే విధంగా ఆర్ధిక సంఘం చర్యలు తీసుకోవడానికి నిర్ణయించారు. ఆర్ధిక సంఘం ఇదివరకే కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్రాలలో పర్యటించి అక్కడి స్థాని సంస్థల ఆర్ధిక వనరులు, సేవలు తదితర విషయాలను పరిశీలించారు. 2019లో పశ్చిమబెంగాల్ కూడా పర్యటించి అక్కడ అమలులో ఉన్న పద్ధతులను పరిశీలించాలని ఆర్ధిక సంఘం నిర్ణయించింది. ఈ ఏడాది కూడా చైర్మన్, సీఈఓ, జడ్పీపీలతోనూ, మైయర్లు, చైర్‌పర్సన్‌లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించి స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చిస్తారు. శుక్రవారం నాడు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక సంస్థలపై విస్తృత చర్చ జరిగింది. 2014-15 సంవత్సరానికి పనుల ద్వారా 6446.82 కోట్లు, 2015-16 సంవత్సరానికి 14,414.36 కోట్లు, 2016-17 సంవత్సరానికి 9781.71 కోట్లు ఆదాయం సమకూరినట్టు అధికారులు చెప్పారు. ఈ పన్నుల ఆదాయంనుండి గ్రామ పంచాయతీలకు, పురపాలక సంఘాలకు, కార్పొరేషన్లకు వివిధ శాఖల ద్వారా కేటాయించిన నిధులను కూడా అధికారులు తెలిపారు. కమిషనర్ పంచాయతీ రాజ్ 2014-15 సంవత్సరానికి గానూ సీనరేజీ ద్వారా 2226.9 కోట్లు ఆదాయం చూపించారని, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అసైన్డ్ రెవిన్యూ లోకల్‌బాడీస్ వివరాలు తీసుకుంటే 2014-15 నుండి 2017-18 నాటికి స్థానిక సంస్థలకు మొత్తం 2794.57 కోట్లు కేటాయించగా, మరో 112.61 కోట్లు కేటాయించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.