తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు ఈసీ తొత్తుగా మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: ఎన్నికల కమీషన్ అధికార టీఆర్‌ఎస్ పార్టీకి తొత్తుగా మారిందని ఎలక్షన్ కమిషన్ టీపీసీసీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ సహకారం వల్లనే అధికారంలోకి వచ్చామన్న కృతజ్ఞతాభావంతోనే మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారని మర్రి విమర్శించారు. జాబితా నుంచి ఓటర్ల తొలగింపు, శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పక్షపాత దోరణి, పంచాయతీ ఎన్నికలు తదితర అంశాలపై టీపీసీసీ ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమై చర్చించింది. ఆ తర్వాత ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నిరంజన్, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావుతో కలిసి మర్రి శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని ఎన్నికల కమిషన్ కమీషనే స్వయంగా అంగీకరించిందని గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు ఆ తప్పులకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలేమిటని శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా పొరపాట్లకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపేతర కూటమి ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్ కొన్ని రాజకీయ పార్టీలతో కలిశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఏ విధంగా ఖూనీ చేశారో ఆయా పార్టీలకు తాము లేఖలు రాయనున్నట్టు శశిధర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల కమీషన్ రాష్ట్ర అధికారులే కాకుండా కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.