తెలంగాణ

‘సెట్’ కన్వీనర్ల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ రాష్ట్రంలో వివిధ పీజీ, యూజీ వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల కన్వీనర్లను ఖరారు చేశారు. ఎమ్సెట్‌కు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య కన్వీనర్‌గా కొనసాగుతారు. టీఎస్ ఈసెట్‌కు జేఎన్‌టియుహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ ఏ గోవర్థన్ కన్వీనర్‌గా కొనసాగుతారు. పీఈసెట్‌కు వరంగల్ కాకతీయ యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీ సత్యనారాయణ కన్వీనర్‌గా ఉంటారు. టీఎస్‌ఐసెట్‌కు వరంగల్ కాకతీయ యూనివర్శిటీ బిజినెస్, మేనేజిమెంట్ ప్రొఫెసర్ సీహెచ్ రాజేశం కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. టీఎస్ లాసెట్‌కు టీఎస్ పీజీఎల్‌సెట్‌కు ప్రొఫెసర్ జీబీరెడ్డి, టీఎ పీజీఈసెట్‌కు ప్రొఫెసర్ ఎం కుమార్, టీఎస్ ఎడ్‌సెట్‌కు ప్రొఫెసర్ టీ మృణాళినీ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీం మే 3,4,6 తేదీల్లో , అగ్రికల్చర్ స్ట్రీం మే 8, 9 తేదీల్లో జరుగుతుంది. ఈసెట్‌ను మే 11న , పీఈసెట్‌ను మే 20న, ఐసెట్‌ను మే 23,24 తేదీల్లో, లాసెట్‌ను మే 26న , పీజీ లాసెట్‌ను మే 26వ తేదీ సాయంత్రం, పీజీఈసెట్‌ను మే 27 నుండి మే 29వ తేదీ వరకూ, టీఎస్ ఎడ్‌సెట్‌ను మే 30 , 31 తేదీల్లో నిర్వహిస్తారు. కన్వీనర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనివర్శిటీల వీసీలే సెట్‌లకు చైర్మన్లుగా ఉంటారు. నిర్వాహక సంస్థగా ఉన్నత విద్యామండలి వ్యవహరిస్తుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి నిర్వాహక కమిటీ చైర్మన్‌గా ఉంటారు. ఒకటి రెండు రోజుల్లో కమిటీల సమావేశాలు జరిగిన తర్వాత సెట్‌ల షెడ్యూలును ప్రకటిస్తారు. ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ తేదీలను, ఆన్‌లైన్ అప్లికేషన్ వివరాలు, దరఖాస్తుల స్వీకార తేదీలు, ముగింపు తేదీలు, పరీక్ష తేదీ , ఫలితాల ప్రకటన తేదీలను ప్రకటించనున్నారు.