తెలంగాణ

నల్లగొండ జిల్లాలో మంత్రి పదవులు ఒకరికా.. ఇద్దరికా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 11: సంక్రాంతి పండుగ రానేవచ్చింది...తెలంగాణ శాసన సభ కొలువుతీరేందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రిమండలి విస్తరణ చేసుకునేందుకు నిర్దేశించుకున్న ముహూర్తాలకు వేళయైంది. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో, సీనియర్లలో ఉత్కంఠత సైతం మొదలైంది. సీఎం కేసీఆర్ ఈ దఫా తన మంత్రిమండలిలో ఎవరెవరికి స్థానం కల్పించనున్నారోనని, మంత్రిమండలి కూర్పు పూర్తి స్థాయిలో ఉంటుందా లేక పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో పరిమితంగా ఉంటుందా అన్న సందేహాలు ఆశవాహుల్లో, పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోట వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్లు జానారెడ్డి, వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి వంటి దిగ్గజ నాయకులను సైతం తిరస్కరించి జిల్లా వాసులు పనె్నండు ఎమ్మెల్యే స్థానాల్లో తొమ్మిందింటిని కట్టబెట్టారు. టీఆర్‌ఎస్‌ను ఆదరించిన న్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కేసీఆర్ తన కేబినెట్‌లో ఒక మంత్రి పదవి ఇస్తారా లేక రెండు కేటాయిస్తారా అన్నదీ ప్రస్తుతం గులాబీ శ్రేణుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకళ్ల జగదీష్‌రెడ్డి మరోసారి మంత్రి పదవి రేసులో ఉన్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కేసీఆర్‌కు ఉద్యమకాలం నుండి కుడిభుజంగా కొనసాగిన జగదీష్‌రెడ్డికి గత ప్రభుత్వ హాయంలో విద్యుత్ శాఖ మంత్రిగా మంచిపేరురావడంతో మరోసారి ఆయన పేరును సీఎం కేసీఆర్ పరిశీలించడం ఖాయంగా కనిపిస్తుంది. అటు గుత్తా సుఖేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీతో పాటు తన పార్లమెంట్ పరిధిలో ఆరు ఎమ్మెల్యే స్థానాలు, ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలు టీఆర్‌ఎస్ గెలువడంలో కీలకంగా వ్యవహారించినందునా గుత్తా పేరుకూడా మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా పరిశీలించనున్నారు. ఇప్పటికే గుత్తాకు మంత్రి పదవి తధ్యమన్న సంకేతాలు ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ వర్గాల్లోకి బలంగా వెళ్లిపోయాయి.
కాగా బీసీ కోటాలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, ఎస్సీ, ఎస్టీ కోటాలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్‌లు మహిళా కోటాలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతలు సైతం మంత్రివర్గం విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఆలేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ సునీతను గెలిపిస్తే పెద్ద పదవి ఇస్తామని ప్రకటించడంతో ఆమెకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం సాగింది. అయితే ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, రేఖానాయక్‌ల రూపంలో ఆమెకు పోటీ నెలకొంది. సామాజిక, రాజకీయ సమీకరణల నేపధ్యంలో మంత్రిమండలి విస్తరణలో నోముల, గాదరి, గొంగిడిలకు సైతం అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాకు ఒక్కటే మంత్రి పదవి ఇస్తారా లేక రెండో మంత్రి పదవి కూడా కేటాయిస్తారా అన్నదే ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంది. రెండు మంత్రి పదవులిస్తే జగదీష్‌రెడ్డి, గుత్తాలకు అవకాశం దక్కనుంది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి టీడీపీ ప్రభుత్వాల్లో దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో వి.పురుషోత్తంరెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల్లో ఇద్దరు చొప్పున ఒకే సమయంలో మంత్రులుగా పనిచేసిన చరిత్ర ఈ సందర్భంగా గమనార్హం. నూతన జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు ఉంటేనే టీఆర్‌ఎస్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి. మరోవైపు పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు, ప్రభుత్వ విప్‌లు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్ పదవుల్లో ఇతర ఎమ్మెల్యేలకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది.