తెలంగాణ

ప్రభుత్వ రంగ పరిశ్రమలకే తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జనవరి 11: సింగరేణి సంస్థ తన 129 సంవత్సరాల చరిత్రలో ఎన్నడు సాధించని ప్రగతిని స్వరాష్ట్రంలో సాధించి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే యావత్త్ ప్రభుత్వ రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం అవిర్భావించిన తరువాత రాష్ట్రంలో అద్భుత ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తున్న ప్రభుత్వ సంస్థలలో సింగరేణి అగ్రగామిగా నిలుస్తోంది. తెలంగాణ వస్తే ఏమి వస్తుంది...? పరిశ్రమలు ఏవౌవుతాయో అని వ్యక్తం అయిన అనుమానాలు పటాపంచాలు చేస్తూ సింగరేణి సంస్థ గత ఐదేళ్లలో విస్మయ పరిచే వృద్ధిరేటును సాధించి సత్తా చాటింది. 2009 - 2014లో బొగ్గు రవాణా ఓబి తొలగింపు, అమ్మకాలు, నికర లాభాలతో పోలిస్తే తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014- 2019 సంవత్సర కాలంలో సింగరేణి సాధించిన వృద్ధి అద్భుతం అని చెప్పుకోవచ్చు. దేశంలో సబ్సిడీ కంపెనీలు గల కోల్ ఇండియా సైతం గత ఐదేళ్లలో ఇంత వృద్ధిని నమోదు చేయలేదు. తెలంగాణ రాక ముందు ఐదేళ్ల కాలంలో బొగ్గు రవాణాలో కేవలం 90 లక్షల టన్నుల వృద్ధిని సాధించిన సింగరేణి తెలంగాణ అవిర్భావం తరువాత గడిచిన ఐదేళ్లలో 200 లక్షల టన్నుల వృద్ధిని సాధించింది. గతం కంటే 122 శాతం అధిక వృద్ధిని సాధించింది. ఓవర్ బర్డెన్ తొలగింపులో తెలంగాణ రాక ముందు ఐదేళ్లలో కేవలం 70 మిలియన్ క్యూబిక్ మీటర్ల వృద్ధిని మాత్రమే సాధించిన కంపెనీ, రాష్ట్ర అవిర్భావం తరువాత గడిచిన ఐదేళ్లలో 250 మిలియన్ క్యూబిక్ మీటర్ల వృద్ధిని నమోదు చేసింది. బొగ్గు అమ్మకాలలో కూడా తెలంగాణ రాష్ట్రం అబ్బురపరిచే విధంగా పెరిగాయి. తెలంగాణ రాక ముందు ఐదేళ్లలో అమ్మకాలు రూ. 5600 కోట్ల వృద్ధిని నమోదు చేసిన కంపెనీ రాష్ట్ర అవిర్భావం తరువాత 13 వేల కోట్ల రూపాయల వృద్ధిని సాధించడం విశేషం. ఈ వృద్ధి 132 శాతంగా నమోదు అయింది. పన్నులు చెల్లించిన తరువాత సంస్థ నికర లాభం కూడా భారీగా పెరిగింది. గత ఐదేళ్లలో నికర లాభం రూ.290 కోట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఏటా పెరిగిన లాభాలతో గడిచిన ఐదేళ్ల కాలంలో 1200 కోట్ల రూపాయల వృద్ధిని (314 శాతం) నమోదు చేసింది.
నెరవేరుతున్న హామీలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలన్ని యజమాన్యం వెనువెంటనే అమలు జరిపి కార్మికుల పూర్తి విశ్వాసాన్ని చూరగొంది. దీనితో కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ పురోభివృద్ధికి త్రికరణ శుద్ధితో సహకరించారు. మెడికల్ అన్‌ఫిట్ కార్మికుల స్థానాలలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పించడం, క్యాంటీన్‌లు, ఆసుపత్రుల ఆధునీకరణ, కార్మికులు, తమ గృహా నిర్మాణానికి తీసుకునే రుణం రూ. 10 లక్షలు, వడ్డీ చెల్లింపు, మ్యాచింగ్ గ్రాంటు 10 రేట్లు పెంపుదల, కార్మికుల క్వార్టర్లకు ఏసి ల ఏర్పాటుకు కనెక్షన్‌లు ఇప్పించడం, ఉన్నత చదువులు చదివే కార్మికుల పిల్లలకు ఫిజుల చెల్లింపు, పదవీ విరమణ పొందిన కార్మికునికి అతని భార్యకు రూ. 5 లక్షల వరకు కార్పొరేట్ వైద్య సేవలు, లాభాలలో 25 శాతం సొమ్ము లాభాలా వాటాగా కార్మికులకు చెల్లింపు మొదలైన వాటిని యజమాన్యం తక్షణమే అమలు చేస్తుంది. సింగరేణి కార్మికులు హామీల అమలుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన యంత్ర వినియోగం
సింగరేణి సంస్థ గనులలో పాత యంత్రాల స్థానాలలో సుమారు రూ. 350 కోట్లతో కొత్త యంత్రాలు కొనుగోలు చేసి గనులకు అందించారు. దీనితో పాటు పాత యంత్ర వినియోగం భారీగా పెంచడానికి మల్టీ డిపార్ట్‌మెంట్ టీమ్ సమావేశాలు ప్రతి గనులలో ఏర్పాటు చేసింది. గనులలో కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే దిశగా ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి ఉత్పత్తికి అటాంకంగా ఉన్న సమస్యలను తొలగిస్తున్నారు.
కార్మికులకు ప్రోత్సాహకంగా మంచి రాయతీ పథకాలను కూడా అమలులోకి తెచ్చారు. గతంలో మాదిరిగా ఏడాదికి లక్ష్యాలు నిర్ధేశించి చివరి వరకు లక్ష్య సాధనకు ఎదురు చూసే పద్ధతికి భిన్నంగా ప్రతి గని సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధేశించడం సాధించేలా డైరెక్టర్‌లు, జీఎం లు కృషి చేసే విధంగా సమీక్షలు సాధనకు దిశా నిర్ధేశం చేస్తూ వస్తున్నారు.
భారీగా పెరిగిన విస్తరణ
సింగరేణి సంస్థ బొగ్గు అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌ఘాడ్, హర్యానా, రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్నాయి. కోలిండియా నుంచి బొగ్గుపొందే కొన్ని సంస్థలు కూడా సింగరేణి సంస్థ నిలకడైన ఉత్పత్తితో నాణ్యమైన బొగ్గును అందిస్తుందని గుర్తించి బొగ్గు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. దీనితో సింగరేణి బొగ్గుకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇతర రాష్ట్రాలకు విస్తరణకు వ్యూహం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు , ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న డిమాండ్‌లను దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ 48 గనులతో పాటు ఇతర రాష్ట్రాలలో మరో 7 బ్లాక్‌లను చేపట్టాలని యోచిస్తుంది. ఇప్పటికే ఒడిస్సాలో 500 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు గల నైనీ బ్లాక్‌ను చేపట్టిన కంపెనీ అదే రాష్ట్రంలో న్యూ పాత్రపురా బ్లాక్‌ను కూడా చేపట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఇవే కాక ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కూడా మరో 6 కొత్త బ్లాక్‌లుకావాలంటూ ప్రతిపాదనలు తయారు చేస్తుంది.
సొంతంగా విద్యుత్ ఉత్పత్తి
సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా స్వతంగా 1200 మెగా విద్యుత్ కేంద్రం ద్వారా రాష్ట్రానికి 19036 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అందిస్తూ అనతికాలంలోనే అత్యధిక పి ఎల్‌ఎఫ్ సాధించిన ఫ్లాంట్‌గా జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటింది.
800 మెగా వాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇవే కాక 12 ఏరియాలలో మరో 300 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఫ్లాంట్‌ల నిర్మాణాలకు కూడా రంగంలోకి దిగుతుంది. తొలిదశలో 130 మెగా వాట్ల సామార్థ్యం గల ఫ్లాంట్‌ను 2018-19 లోపూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించనుంది.