తెలంగాణ

అత్యంత చౌకగా అణు విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 11: సమాజంలో విద్యుత్ వినియోగం నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా అత్యంత చౌకగా అణు విద్యుత్ ఉత్పత్తి చేసే అద్భుత సదుపాయం ఉందని తమిళనాడు కల్పకంలోని ఇందిరాగాంధీ సెంటర్‌ఫర్ అటామిక్ రీసర్చ్ సెంటర్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బి. వెంకట్రామన్ పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ విద్యాసౌధంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక వైజ్ఞానిక ప్రసంగం చేశారు. అణుధార్మికత, సురక్షిత మార్గాల ద్వారా సామాజిక పురోగతికి వినియోగించవచ్చునని, అణు రియాక్టర్‌లతో ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచిస్తూ ఇందులో ప్రమాదమేమీ ఉండదని స్పష్టం చేశారు. అయితే, ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత ఉండగా, రేడియేషన్‌ను వైద్యంతో పాటు అనేక విభాగాలలో ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సూర్యుని నుండి, గ్రానైట్ సిమెంట్, భవన నిర్మాణ వ్యర్థాలు, సహజ సిద్ధమైన కనకాంబరాల నుండి రేడియేషన్ వస్తోందని సోదాహరణంగా వివరించారు. మితిమీరిన సెల్‌ఫోన్ వినియోగం హానికరమైనదేననీ.. రేడియేషన్‌కు హేతువని తెలిపారు. శృతిమించిన సెల్‌ఫోన్ వాడకంతో చెవి అంతర్గత భాగాలకు, తలలోని సున్నిత అవయవాలకు హాని కలుగుతుందని, ఇతర అంశాల ద్వారా వచ్చే రేడియేషన్ కన్నా అణు రియాక్టర్‌లతో వచ్చే రేడియేషన్ దుష్ప్రభావం చాలా తక్కువని చెప్పారు. థోర్యం, యురేనియం వంటి సహజ వనరులు ప్రపంచంలో గరిష్టంగా ఉన్న దేశాలలో మన దేశం 2వ స్థానంలోఉందని, నిర్మిస్తున్న అణురియాక్టర్లు అత్యంత రక్షణ చర్యలు ఏర్పాటు చేసిన కేంద్రాలని అన్నారు. అనవసర భయాలు తొలగించుకొని దేశ ప్రగతికి, అణుశక్తిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. బార్క్ వంటి అణుపరిశోధన కేంద్రాలలో విద్యార్థులకు అద్భుత ఉద్యోగావకాశాలు ఉండగా, అణుశక్తి వినియోగంపై అవగాహన పెంచుకొని దేశ అభ్యున్నతికి తోడ్పాటునందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఎలక్ట్రానిక్స్ విభాగం చైర్మెన్ ప్రొఫెసర్ మదు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, భౌతికశాస్త్రం విభాగం అధ్యక్షులు భవాని, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాశశి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ, డాక్టర్ అయోధ్యా రెడ్డి, హరికృష్ణ, రజనీవ్, అడవి రాజు, రఫియాబేగంలు పాల్గొన్నారు.