తెలంగాణ

పల్లెకు పోదాం..పండుగ చేద్దాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 11: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పల్లె పయనం ప్రారంభమైంది. శుక్రవారం నుంచి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు రెండవ శనివారం, ఆదివారం కలిసి రావడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు సంక్రాంతి పండుగకు కలిసి వచ్చాయి. దీంతో భాగ్యనగరంలో ఉంటున్న ఆంధ్రవాసులు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కోడిపందాలు కూడా జోరుగా సాగుతాయి. దీంతో సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. అదేవిధంగా స్వరాష్ట్రానికి చెందిన ఉద్యోగాలు, పిల్లల చదువులు, వ్యాపారాల నిమిత్తం ఉంటున్న పల్లె వాసులు సంక్రాంతి పండుగను బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో వైభవంగా జరుపుకునేందుకు పల్లెబాట పట్టారు. వారం రోజులకు అవరమయ్యే సరుకులు మూటగట్టుకోని ప్రత్యేక వాహనాలలో పల్లెకు పయనమవ్వడంతో జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. హైవేపై వాహనాల జాతర క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం రోజువారి కంటే 15 నుంచి 20 శాతం వాహనాలు పెరిగినట్లు సమాచారం. ప్రతి రోజు 17వేల వాహనాలు వెళ్తుండగా శుక్రవారం 20 వేల వరకు వెళ్లినట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. పంతంగి టోల్ వద్ద వాహనాలు బారులుతీరి కన్పించాయి. జాతీయ రహదారిపై ప్రత్యేక తనిఖీల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను తొలగించి రాకపోకలకు సుగుమం చేసారు. హైవే వెంట పోలీసు బందోబస్తు పెంచారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే టోల్ గేట్ల సంఖ్యను పెంచారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసారు. టోల్ వద్ద వాహనాలు బారులుతీరకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. టోల్‌ప్లాజా వద్ద 16 గేట్లు ఉండగా పది గేట్లను విజయవాడ వైపు తెరిచారు. వాహనాల రద్దీని బట్టి మరిన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేసారు. పట్టణ ప్రజలు పల్లెల్లో సంక్రాంతి పండుగ పూర్తి చేసుకోని భాగ్యనగరం చేరుకునే వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీస్ శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.