తెలంగాణ

కాంగ్రెస్‌లో విలీనం చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. శనివారం ప్రొఫెసర్ కోదండరామ్ తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత తేలిగ్గా పార్టీలు మారుస్తున్నారని అన్నారు. లోగడ నాయకులు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడేవారని, పార్టీలు వీడే వారు కాదని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓటమిపై తమ పార్టీలో చర్చించలేదన్నారు. ఎన్నికల్లో టీజేఎస్ ఓటమితో తాము నిరాశ చెందలేదని, ఆందోళన అసలే లేదన్నారు. పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం వల్ల గ్రామ స్థాయి వరకూ వెళ్ళలేకపోయినందుకే ఓటమి చెందినట్లుగా భావించామని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూటమితో కలిసి పోటీ చేయలా? వద్దా? అనే అంశంపైనా చర్చించలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిన అవసరం లేదని, రానున్న ఎన్నికలపై తమకు అంతర్గతంగా ఆలోచన ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల అధికారిపై అనుమానాలు చాలా మందిలో ఉన్న విషయం వాస్తవమేనని అన్నారు. ఓట్ల తొలగింపుపై ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిపై రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. సీబీసీఐడీతో ఎన్నికల అధికారిపై విచారణ జరిపించాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళమని అన్నారు.