తెలంగాణ

‘ఆశా వర్కర్ల జీతాలు చెల్లించలేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా)కు గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించలేదని వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా) యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం హైదరాబాద్‌లో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ, తులసీ ఒక ప్రకటన చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. కనీసం రూ. 1,500 రూపాయలు పెంచనున్నట్లు హామీ ఇచ్చిన విషయం సీఎం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. 2018 సెప్టెంబర్ నుంచి జీతాలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలని, పెరిగిన జీతాలు కలిపి పెండింగ్‌లో ఉన్నవాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.