తెలంగాణ

విచ్చలవిడి పరిశోధనా పత్రాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సమర్పిస్తున్న పీహెచ్‌డీలు, ఎంఫిల్ థీసిస్‌లకు దిక్కూ దివాణా ఉండటం లేదు, కొన్ని యూనివర్శిటీలు ఈ కాపీలను లైబ్రరీలకు పరిమితం చేస్తుండగా, చాలా విశ్వవిద్యాలయాలు వీటిని కొట్టుగదులకు పరిమితం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ థీసిస్‌లలో ఏ అంశం ఉందో, వాటిని ఎంత వరకూ ముందుకు తీసుకువెళ్లవచ్చో కూడా తెలియని దురవస్థ ఉంది. చాలా వరకూ థీసిస్‌లు కాపీ కొట్టి అందజేస్తున్నారు. దీనిపై కేంద్రానికి ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్లినా , కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఎన్ని మార్లు మార్గదర్శకాలు జారీ చేసినా యూనివర్శిటీల్లో మాత్రం మార్పు రావడం లేదు. వాస్తవానికి యూనివర్శిటీలు ప్రతి థీసిస్‌నూ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తే వాటిలో సరుకు , పస మిగిలిన వారికి కూడా అర్ధమవుతుంది. కొన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలుగా పనిచేసిన వారు సైతం సమర్పించిన థీసిస్‌లు కాపీ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ కాన్సార్టియం ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చి ఎథిక్స్ సంస్థను ఏర్పాటు చేసింది. ‘కేర్’ పేరుతో దీనిని ప్రతి థీసిస్ పరిశీలనకు, పరిష్కారానికి చర్యలు చేపడతారు. అలాగే ఏ జర్నల్స్‌లో ప్రచురించబడాలో కూడా యూజీసీ గుర్తించింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పేరుతో ఒక జర్నల్‌ను ప్రారంభించి దాంట్లో ప్రచురణలు వేస్తూ పోవడం వల్ల నాశిరకం ప్రచురణలు వస్తున్నాయి, ఈ క్రమంలో యూజీసీ ఏ ఏ జర్నల్స్‌ను గుర్తించాలో, వేటిలో ప్రచురించబడాలో కూడా నిర్దేశించింది. కేర్ రిఫరెన్స్ లిస్టు ఆఫ్ క్వాలిటీ జర్నల్స్ పేరుతో ఒక జాబితాను రూపొందించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించేందుకు ప్రొఫెసర్ పి బలరాం అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది.