తెలంగాణ

ఫిరాయింపుల పిటిషన్లపై ముగిసిన వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూలు) ప్రకారం అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటీషన్లపై వాదనలు ముగిసాయి. శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ కే. స్వామిగౌడ్ పిటీషనర్, కౌంటర్ పిటీషనర్ల వాదనలు విన్న తర్వాత శనివారం తన తీర్పును రిజర్వ్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ తరఫున శుక్రవారం అడ్వకేట్ వాదన వినిపించిన సంగతి తెలిసిందే. తన క్లయింట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైనందున, చర్య తీసుకునే అధికారం గవర్నర్‌కు తప్ప, చైర్మన్‌కు ఉండదని ఆయన వాదించారు. కాగా కౌంటర్ పిటీషనర్ తరఫున అడ్వకేట్ దీనికి ససేమిరా అన్నారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన తర్వాత ఆరు నెలల్లోగా ఏదైనా ఒక పార్టీలో చేరితే, అప్పుడు చైర్మన్ పరిథిలోకే వస్తారని వాదించారు. దీంతో చైర్మన్ స్వామిగౌడ్ తీర్పును రిజర్వ్ చేశారు. శనివారం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవ రెడ్డిల తరఫు అడ్వకేట్ల వాదనలను చైర్మన్ విన్నారు. వారి విషయంలోనూ తీర్పు రిజర్వ్ చేశారు. ఇలాఉండగా పిటీషనర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఇదివరకే చైర్మన్ స్వామిగౌడ్ వద్ద పిటీషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. నెల రోజులుగా ఫిరాయింపుదారులైన సభ్యులు సమయం కోరగా, అందుకు చైర్మన్ తగిన సమయం ఇచ్చారని ఆయన తెలిపారు. మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభలో సోనియా గాంధీ కండువా కప్పిన ఫొటోలు, ఇతర సాక్ష్యాలనూ చైర్మన్‌కు అందజేశామని ఆయన చెప్పారు. చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని కోరామని, చైర్మన్ తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
చిత్రం..కౌన్సిల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి