తెలంగాణ

ఉద్యాన పంటల రైతులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: రాష్ట్రంలోని ఉద్యాన పంటల రైతులకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన పంటలకు సరైన ధర లభించడంలో, ప్రజల అవసరాలకు అనుగుణంగా పళ్లు, పూల ఉత్పత్తులు జరిగేలా చర్యల కోసం సమగ్ర ప్రణాళికలను రూపొందిచాలని సంబంధిత అధికారులను వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, ఆహారశుద్ధి, విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయ, ఉద్యాన పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ అంశంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఏ ఏ పంటలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయో, ఏ ఏ పంటలు అవసరానికన్నా తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయో ఈ ప్రణాళికలో పొందుపరచాలన్నారు. అధికంగా ఉత్పత్తి అవుతున్న పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసేందుకు పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇందుకు కార్యారచరణ ప్రణాళిక రూపొందిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తంలో ఒకే పర్యాయం ఈ పనులు చేపట్టేందుకు వీలుకాకపోవచ్చని, అందువల్ల ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలను పరిశీలించి, నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆగ్రోప్రాసెసింగ్ పరిశ్రమలకు ముడిసరకు అందించే విధంగా సంబంధిత పంట కాలనీలను ప్రోత్సహించాలని సూచించారు.
ప్రభుత్వ విధానాల మూలంగా వచ్చే సంవత్సరం నుండి సాగునీరు చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తుందని, ఈ నీటిని వరిసాగుకోసం వినియోగించకుండా, ప్రత్యామ్నాయ పంటలు ఉద్యాన పంటలకోసం ఉపయోగించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మండలాల వారీగా వ్యవసాయ, ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని వారం రోజుల్లోగా సేకరించి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్‌కు అందించాలని అధికారులు ఆదేశించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని జనవరి 25 లోగా పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ నాటికి ప్రయోగాత్మకంగా అమలు జరిగేలా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో వ్వవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్. వెంకటరామిరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ డాక్టర్ ప్రవీణ్‌రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ అఖిల్, డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న పార్థసారథి