తెలంగాణ

జిల్లా ఏర్పాటుకు ముందే జాక్‌పాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 12: ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గానికి విద్యాకళ సంతరించుకోనుంది. ప్రతిష్టాత్మకమైన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగులో ఏర్పాటు కాబోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటి గిరిజన వర్సీటీ ములుగు కావడం ప్రాధన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు ములుగు నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆజ్మీర చందూలాల్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికి ములుగులోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. గిరిజన యూనవర్సిటీ ఏర్పాటుకు కేంద్రం కోరినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ములుగు శివారులోని గట్టమ్మ గుట్ట ప్రాంతంలో 483 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఇందులో 173 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినది కాగా, 213 ఎకరాలు అటవీశాఖకు, మరో 100 ఎకరాలు అసైండ్ భూమి సిద్ధం చేశారు. ఇందు కోసం భూసేకరణ కింద 10 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అంతే కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ములుగు బహిరంగ సభలో తిరిగి అధికారంలోకి రాగానే ములుగును జిల్లా కేంద్రంగా చేస్తానని హామి ఇచ్చిన్నట్లుగానే జిల్లా ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే ములుగు జిల్లా కేంద్రంగా చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. ములుగు జిల్లాకు ఒక వైపు అడుగులు పడుతుండగానే ములుగులోనే జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కొత్తగా ఏర్పాటు కానున్న ములుగు జిల్లాకు ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే జులై మాసం నుండే ఆరు కోర్సులతో వర్సిటీ తరగతులు ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు అయ్యింది. ములుగు మండలం జాకారం గ్రామం వద్ద ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేసి మెరిట్ ప్రకారం సీట్లు భర్తి చేయనున్నారు. ముందుగా గిరిజన విద్యార్ధులకు ఉపాధి లభించేలా కోర్సులు ప్రారంభిస్తారు. ఒక్కోకో కోర్సులో 30 మంది విద్యార్ధులకు ప్రవేశం కల్పించనున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ తరగతులు ప్రారంభిస్తారు. తెలంగాణ గిరిజన యూనివర్సిటీలో సానిక గిరిజన విద్యార్ధులకు 30శాతం సూపర్ న్యూమరిక్ సీట్లు కేటాయించారు. కాంపౌండ్ హాల్ నిర్మాణాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం చేపట్టాలని, గిరిజన యూనివర్సిటీ ద్వారా స్ధానిక గిరిజన విద్యార్ధుల విద్యాభివృద్దికి, గిరిజనుల ఆర్ధికాభివృద్ధికి ఎంతో తోడ్పాటుకానుంది. ములుగు జిల్లా కేంద్రంగా కావడం, ఇక్కడే జాతీయ స్ధాయి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం పట్ల స్ధానికుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.
చిత్రం..ములుగు మండలం జాకారం వద్ద నున్న యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో
తాత్కాలికంగా ప్రారంభం కానున్న గిరిజన వర్శిటీ భవనం ఇదే