తెలంగాణ

జిల్లాల పర్యటనలో ఎన్నికల కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు సిద్ధిపేట, రాజన్న సిర్సిల్లా, జగిత్యాల, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పేపర్లను మాత్రమే వాడుతున్నారు. ఈవీఎంలను వాడటం లేదు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ స్థానాలు వార్డు సభ్యుల స్థానాలు కలిపి 1,25,000కు పైగా స్థానాలు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో అవసరమైన ఈవీఎంలను సేకరించేందుకు సాధ్యం కాదని అందువల్లనే బ్యాలెట్ పేపర్లను వాడుతున్నామని ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ తెలిపారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. బ్యాలెట్ బాక్సులను సేకరించి భద్రపరిచామని తెలిపారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి.