తెలంగాణ

రిజర్వేషన్ల సమస్య సామాజిక ఉద్రిక్తతలు సృష్టిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: రిజర్వేషన్ల సమస్య సామాజిక ఉద్రిక్తతలు సృష్టిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మండల్ కమిషన్ సందర్భంగా మీసీలకు రిజర్వేషన్లు పెట్టినప్పు డు అగ్రకులాల వారు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అగ్రకులాలకు రిజర్వేషన్లు పెడితే బలహీనవర్గాల వారు వ్యతిరేకిస్తారని అన్నారు. ఆదివారం జరిగిన బీసీ కులాల సమావేశంలో కృష్ణయ్య ప్రసంగిస్తూ అందుకే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే ఎస్‌సీ, ఎస్ టీ, బీసీ అగ్రకులాలకు జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు విభజించి పెట్టాలని సూచించారు. బీసీలకు జనాభా ప్రకారం 54 శాతం, అగ్ర కులాలకు 15 శాతం, మైనారిటీలకు 8 శాతం, ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. బీజేపికి ఏ మాత్రం దేశాభివృద్ధి పట్ల, సమాజం సామరస్యం పట్ల చిత్తశుద్ధి ఉన్నా, జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, ఇతర నాయకులు మనె్నం వెంకటేష్, గుడి రామకృష్ణ, విఠల్, కోట్ల శ్రీనివాస్, ఎం. మహేందర్‌గౌడ్, ఎం. సుధాకర్‌గౌడ్, ఉదయ్, విశే్వశ్వరరావు, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.