తెలంగాణ

మర్రి చెన్నారెడ్డి అందరివాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అందరివాడు, ఇచ్చిన మాట తప్పేవాడు కాదు..అని మాజీ గవర్నర్ కే. రోశయ్య అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్‌లో గల మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్స్‌లో ఆదివారం డాక్టర్ చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కే. రోశయ్య ప్రసంగిస్తూ చెన్నారెడ్డితో కలిసి పని చేసే అవకాశం తనకు దక్కిందన్నారు. డాక్టర్ రెడ్డి అల్ప సంతోషి అని ఆయన చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి ప్రసంగిస్తూ గొప్పవ్యక్తిత్వం గల చెన్నారెడ్డి జీవితం దేశానికి ఆదర్శం అని అన్నారు. ఎంపీ టీ. సుబ్బరామిరెడ్డి ప్రసంగిస్తూ డాక్టర్ చెన్నారెడ్డి గొప్ప మానవతావాది అని చెప్పారు. తనకు 50 ఏళ్ళ పరిచయం ఉందని, ఏదైనా తప్పు చేస్తే తిట్టేవారని చెప్పారు. డాక్టర్ చెన్నారెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ రారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెన్నారెడ్డి జీవితాన్ని పుస్తక రూపంగా తీసుకుని రావాలని ఆయన సూచించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి ప్రసంగిస్తూ గోదావరి నదీ జలాల సద్వినియోగానికి చెన్నారెడ్డి పథకాన్ని రూపొందించారని చెప్పారు. జస్టిస్ సుభాష్ రెడ్డి ప్రసంగిస్తూ చెన్నారెడ్డి వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని తెలిపారు. చెన్నారెడ్డి చేసిన సేవలు, పనులపై మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. చెన్నారెడ్డి శత జయంతి సందర్భంగా ఇందిరా పార్కు వద్ద, గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమాల్లో టీ.పీ సీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. ఉత్తమ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య, పారదర్శక రాజకీయాలకు ప్రతిరూపమని అన్నారు.
తెలంగాణ మొనగాడు: మాజీ మంత్రి నాయిని
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ మొనగాడు మర్రి చెన్నారెడ్డి అని కొనియాడారు. చెన్నారెడ్డి చేసిన సేవలను గురించి పుస్తక రూపంలో తీసుకుని రావాల్సిన అవశ్యకత ఉందన్నారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, చెన్నారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.

చిత్రం..లోయర్ ట్యాంక్ బండ్‌లో గల మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్స్‌లో ఆదివారం
డాక్టర్ చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు