తెలంగాణ

సూర్యాపేట జిల్లాలో 13 ఏకగ్రీవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 13: జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో పలుచోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. మొత్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలో 7 మండలాల పరిధిలోని 161 పంచాయతీ సర్పంచ్, 1456 వార్డు స్థానాలకు ఆదివారం నామినేషన్‌ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో రాత్రి అందిన సమాచారం మేరకు జిల్లాలో 13 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి విడతలో అత్యధికంగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండల పరిధిలో 4 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చివ్వెంల మండల కేంద్రం పంచాయతీ సర్పంచ్‌గా టీ ఆర్ ఎస్ బలపరిచిన జూలకంటి సుధాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 10 మంది వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీమ్లా తండ సర్పంచ్‌గా ధరావత్ హుడియా, పాచ్యానాయక్ తండ సర్పంచ్‌గా ధరావత్ రవి ఎన్నికయ్యారు.