తెలంగాణ

ఎట్టకేలకు టోల్ వసూళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని చౌటుప్పల్ ఆర్డీవో ఆదేశించడంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై టోల్ వసూళ్లను ఆదివారం మధ్యాహ్నం నుంచి నిలిపివేసారు. సంక్రాంతి పండును పురస్కరించుకోని టోల్‌గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోవడం, ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగ ముందు, పండుగ తర్వాత రోజు 13,16 తేదీలలో టోల్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి 13,16 తేదీల్లో టోల్ వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించారు. కానీ జీఎంఆర్ సిబ్బంది అవేమి పట్టించుకోకుండా టోల్ వసూళ్లను కొనసాగించింది. ఉదయం పత్రికల్లో చూసిన ప్రయాణికులు టోల్‌గేట్ వద్ద ఘర్షణకు దిగారు. టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారని అధికారులు, సిబ్బందిని నిలదీసారు. జీఎంఆర్ సిబ్బందితో పత్రికను చూపిస్తూ వాగ్వాదానికి దిగారు. ఎలాంటి ఘర్షణ జరుకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘర్షణను నివారించేందుకు తంటాలుపడ్డారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్ పంతంగి టోల్‌ప్లాజా వద్దకు చేరుకోని జీఎంఆర్ అధికారులు, సిబ్బందితో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో టోల్ వసూళ్లను నిలిపివేయలేమని తేల్చిచెప్పడంతో జాతీయ రహదారుల సంస్థ పీడీతో ఫోన్‌లో మాట్లాడారు. టోల్ వసూళ్లను నిలిపివేయకుంటే జీఎంఆర్‌కు సహకరించలేమని, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న బాధ్యత మీదేనని హెచ్చరించారు.
ఆర్డీవో ఆదేశాల మేరకు ఎట్టకేలకు 11.00 గంటల తర్వాత టోల్ వసూళ్లను నిలిపివేసారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. టోల్‌గేట్లను తెరిచడంతో వాహనాలు సునాయసంగా వెళ్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పంతంగి టోల్‌ప్లాజాను సందర్శించి టోల్ వసూళ్లను నిలిపివేయడం, ట్రాపిక్ జామ్ కాకుండా వాహనాలు వెళ్తుండటంతో తిరిగివెళ్లారు.
చిత్రాలు.. టోల్‌గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు,
* ఘటనా స్థలానికి వచ్చిన కలెక్టర్ అనిత