తెలంగాణ

రాష్ట్ర కాంగ్రెస్‌లో అగ్రవర్ణాల ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 14: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందా? ఇతర సామాజిక వర్గాల పట్ల ఈ వర్గాల్లో గతంలోలాగే వివక్షను కొనసాగిస్తున్నాయా అంటే ‘ఔననే’ అంటున్నారు. రాజకీయ పరిశీలకులు. ఇందుకు వారు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలను ఉదహరిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ నుండి అధికారాన్ని చేజిక్కించుకోవాడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రాతి త్రీవంగా ప్రయత్నించింది. అందుబాటులో ఉన్న అన్ని పార్టీలను, అన్ని వనరులను సమకూర్చుకొని సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. అధికారం అందుకోబోతున్నామన్నంత ధీమాతో ప్రచారాన్ని కొనసాగించింది. కానీ ఎన్నికలలో ఊహించని ఫలితాలను అందుకున్నది కాంగ్రెస్ పార్టీ. దారుణమైన రీతిలో ఓటమి చవిచూసింది. అయితే, అసలు ఎం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎందుకిలా వచ్చాయి? ఎక్కడ పొరపాటు జరిగింది? అందుకు దారితీసిన పరిస్థితులేమిటి అన్న అంశాలపై సమగ్రమైన చర్చ ఇంత వరకు జరగకపోవడం పట్ల కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కాంగ్రెస్ పట్ల సానుభూతి ఉన్నా, సోనియా అంటే ఎంతో అభిమానం ఉన్నా, అధిష్టానం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లడంతో స్దానిక నేతలు విఫలమయ్యరని వీరు ఆరోపిస్తున్నారు. పైగా ఇందుకు బాధ్యులైన స్దానిక నాయకులపై చర్యలు తీసుకోవడంలో పార్టీ ఉదాసీన వైఖరిని అవలంబిస్తొందని విమర్శలు వస్తున్నాయి. అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బలహీన వర్గాలకు ఒక న్యాయం ఉంటుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు వారు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫలితాలను ఉదహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఉద్యమ అయిన టీఆర్‌ఎస్‌కు ఓడించలేకపోయింది. ఇప్పటి డిసెంబర్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి 20 సీట్లకు అటు ఇటుగా వచ్చినట్లుగానే అప్పుడు వచ్చాయి. అయితే అప్పటి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీలో అగ్ర వర్ణ నేతలంతా కలసి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను బాధ్యునిగా చేశారు. ఇదే విషయాన్ని అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేశారు. అనేక నివేదికలు పంపారు. ఆఖరికి పొన్నాలను ఆ పదవి నుంచి తొలగించి ఇంటికి సాగనంపారు. కానీ ఇప్పుడు టీపీసీసీ అధ్యుక్షునిగా ఉన్న వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఈ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అంటే పొన్నాలకు ఒక న్యాయం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఒక న్యాయం ఉంటుందా? అని ఈ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దళితుల, పేదల పక్షపాతిగా పేరున్న కాంగ్రెస్ పార్టీలో ఇంకా పెద్దల పెత్తనమే కొనసాగుతున్నదని ఈ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇప్పటికైన సరిదిద్దేందుకు ఢిల్లీ పెద్దలు పూనుకోకపోతే ఇప్పటిదాక అండగా ఉన్న కొద్దిపాటి ఈ వర్గాలు కూడా దూరమయ్యే పరిస్థితులు ఎదురవుతాయని ఈ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అధిష్టానం కళ్లు తెరవకపోతే పార్టీకి ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో పట్టిన గతే పట్టవచ్చునని అంటున్నారు.