తెలంగాణ

ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ ప్రో-టెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజ్‌భవన్‌లో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సాయంత్రం ఐదు గంటలకు ముంతాజ్‌ఖాన్ చేత పో-టెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి చైర్మన్ కే. స్వామిగౌడ్, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్‌తో పాటు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా మంది సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి, పోలీస్ డైరెక్టర్ జనరల్ మహేందర్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి తదితరులు హాజరయ్యారు.
గురువారం ఉదయం శాసనసభ ప్రారంభమైన తర్వాత కొత్త సభ్యుల చేత ముంతాజ్‌ఖాన్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను నిర్వహిస్తారు.
సీఎం, ప్రతిపక్షనాయకుడితో పాటు కొత్త స్పీకర్‌ను శాసనసభ స్పీకర్ స్థానం వరకు ప్రో-టెం తీసుకువచ్చి కూర్చోబెడతారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తికాగానే ప్రో-టెం స్పీకర్ బాధ్యతల నుండి ఆయన తప్పుకుంటారు. తెలంగాణ రెండో శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో ముంతాజ్‌ఖాన్ సీనియర్ శాసన సభ్యుడు కావడంతో ఆయనను ప్రో-టెం స్పీకర్‌గా గవర్నర్ నియమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే ముంతాజ్‌ను ప్రో-టెం స్పీకర్‌గా నియమించారు. ముంతాజ్‌ఖాన్ ఇప్పటికే ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఆరో పర్యాయం ఎమ్మెల్యేగా చార్మినార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

చిత్రం..అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం సభ్యుడు ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో ప్రమాణ స్వీకారం చేయస్తున్న గవర్నర్ నరసింహన్. వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్