తెలంగాణ

నవోదయకుదీటుగా ఏకలవ్య విద్యాసంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: జవహర్ నవోదయ పాఠశాలలకు ధీటుగా ఏకలవ్య పాఠశాలలను తీర్చిదిద్దుతామని గిరిజన వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి జశ్వంత్ సిన్హా సుమన్ భాయ్ భభోర్ పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర గిరిజన వ్యవహారాల శాఖ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మీట్ బుధవారం నాడు ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాలలు నెలకోల్పాలన్న ఆలోచన దివంగత ప్రధాని అటల్ బిహారి వాజపేయిదేనని, అయితే ఆ ఆలోచనను ప్రధాని నరేంద్రమోదీ ఆచరణలో పెట్టారని పేర్కొన్నారు. 2022 నాటికి 400 ఏకలవ్య మోడల్ స్కూళ్లు ప్రారంభించి, వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏకలవ్య పాఠశాలలకు గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో పోలిస్తే ఈసారి మరింత అధికంగా కేటాయింపులుంటాయని అన్నారు. వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, అందరూ పట్టుదలతో కృషి చేస్తూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గిరిజన యువతలో ఎంతో ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయని, అందుకు క్రికెటర్ ధోని, బాక్సర్ మేరీకోమ్‌లే నిదర్శనమని అన్నారు.