తెలంగాణ

కొత్త సభాపతి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: శాసనసభ స్పీకర్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ జరగనుంది. సభలో టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉండటంతో స్పీకర్ ఎన్నిక లాంఛనప్రాయమే. అయినప్పటికీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్ధీన్ ఒవైసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెంటనే సీఎం ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఈ అంశాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపినట్టు పేర్కొన్నారు. ఇలా ఉండగా స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవికి ఎవరిని ఎంపిక చేసిందీ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. అయితే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. స్పీకర్ పదవికి మాజీ మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్లు కూడా సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే వీరిలో పోచారం మినహా ఇతరులు స్పీకర్ పదవి పట్ల విముక్తి కనబర్చడంతో పోచారం ఎంపికకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.