తెలంగాణ

మీకో నీతి... ప్రతిపక్షాలకో రీతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: కాశ్మీర్ అస్థిత్వాన్ని ప్రశ్నించిన టీఆర్‌ఎస్ పార్టీ దేశ హితం గురించి ఆలోచిస్తుందని ఎవరూ అనుకోరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే వాటికి ఆధారాలు అడిగిన పార్టీలకు ఓటు అడిగే హక్కు ఉందా అని నిలదీశారు. ఈనెల చివరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారని, మార్చి నెలలో ప్రధాని నరేంద్రమోదీ కూడా రాష్ట్రానికి వస్తారని ఆయన చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఫిరాయిస్తే అనర్హత వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఏ పార్టీ నుండి ఫిరాయించినా అనర్హత వేటు వేయాల్సిందేనని అన్నారు. అధికార పార్టీకి ఒక నీతి, మరో పార్టీకి ఇంకో నీతి పనికి రాదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకూ అన్ని వర్గాలకూ ఒకే రకమైన న్యాయం ఉండాలని, అధికార పార్టీకి ఒక రకంగానూ ప్రతిపక్ష పార్టీలకు మరో రకంగా ఉండటం ఎంత వరకూ భావ్యమని చెప్పారు. దేశ ప్రజలు బీజేపీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ కూటములు బలహీన ప్రభుత్వాల కోసం పరితపిస్తున్నాయని, మజ్బూత్ సర్కార్ బీజేపీ మాత్రమే ఇస్తుందని చెప్పారు. రైతు సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు వారి ఆదాయాన్ని రెట్టింపుచేయాలనే లక్ష్యానికి అనుగుణమైనవేనని అన్నారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేదని పేర్కొన్నారు. గ్రామీణ విద్యుదీకరణ, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, వీర జవాన్లకు వన్ ర్యాంకు వన్ పెన్షన్ విధానం వంటివి చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలని అన్నారు. 70 ఏళ్లలో 6 కోట్ల 25 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తే మోదీ ప్రభుత్వం ఐదేళ్లలో 7 కోట్ల 50 లక్షల మరుగుదొడ్లను నిర్మించిందని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పాలన అంతా అవినీతిమయంగా సాగిందని ప్రజలు అర్ధం చేసుకున్నారని, జాతీయ దృక్పధం లేకుండా ఏర్పడే కూటములు కేవలం తమ కుటుంబ ప్రయోజనాలు, ప్రాంతీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడానికి మాత్రమే పనికొస్తుందని వ్యాఖ్యానించారు.
చిత్రం..పాత్రికేయులతో మాట్లాడుతూన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్