తెలంగాణ

భూ రికార్డులు సరిదిద్దకే..రైతు ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జనవరి 16: రాష్ట్రంలో రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.అవినేష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తలపెట్టిన భూ ప్రక్షాళనలో భాగంగా పార్ట్-ఎ, పార్ట్-బి కెటాయింపులు చేసి రైతులను ఇబ్బంది పెట్టారని దుయ్యబట్టారు. పార్ట్-ఎలో ఉన్న భూములను పార్ట్-బిలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రైతులకు క్లియర్‌గా పాస్ పుస్తకాలు చేయకుండా రికార్డులను పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. ఈ విధంగా రైతులను వీఆర్‌ఓలు, తహశీల్దార్ల చుట్టు తిప్పుకుంటూ లంచాలకు ఎగబడుతున్నారని ఆయన ఆరోపించారు. 40 నుండి 50 శాతం వరకు సాగులో ఉన్న భూములు రికార్డులలో ఉన్నప్పటికీ అప్‌గ్రేడ్‌లో తప్పిదాలు చేసి రైతులను బాధ్యులను చేస్తున్నారని ఆరోపించారు. 30 నుంచి 40 శాతం భూ రికార్డులు సరిచేయలేదన్నారు. ఈ విషయంలో వీఆర్‌ఓ, తహశీల్దార్లు డబ్బు గుంజుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. సాదాబైనమాలో కూడా రైతుల నుంచి డబ్బు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాగా ప్రభుత్వం రైతుల రికార్డులు సరిదిద్దకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. భూ రికార్డులు సరిచేయాలని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేసినట్లు తెలిపారు. భూ రికార్డుల విషయంలో గ్రామ స్థాయిలో విచారణ జరిపి రైతుబంధు పథకానికి సహకరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూముల్లో కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు. అసైన్డ్, ఫారెస్ట్ భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదన్నారు. ఫారెస్ట్ భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు న్యాయం చేయడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మెదక్ జిల్లాలో ఇలాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో 174 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 194 జీవో ప్రకారం రైతులకు అంత్యోదయ, డబుల్ బెడ్‌రూమ్‌లు వంటి పథకాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు.
మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి
మెదక్ జిల్లాకు తాగునీరు, సాగునీరుకు ముఖ్యమైన సింగూర్ ప్రాజెక్ట్‌లో రెండు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని అవినేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలిపారు. సింగూర్ నుండి 16 టీఎంసీల నీటిని కేటీఆర్ నియోజకవర్గానికి మాజీ మంత్రి హరీష్‌రావు తరలించారన్నారు. దీని వలన మెదక్ నిజాంసాగర్ పొలాలు సాగులోకి రాలేదని తెలిపారు.
ఫలితంగా మెదక్, నిజాంసాగర్ ప్రాంతాలకు పంట పొలాలే కాకుండా తాగునీరు కూడా కరువైందన్నారు. వేసిన నారుమల్లు కూడా ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అందువలన మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం పశువులకు కూడా తాగునీరు కరువయ్యే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అందించే కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.