తెలంగాణ

ప్రకాష్‌కు పర్యావరణ సంరక్షక్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జనవరి 16: ప్రభుత్వ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్‌కు పర్యావరణ సంరక్షక్ అవార్డు లభించింది. జనవరి 15, 16 తేదీల్లో రాజస్తాన్‌లో బీకాంపురలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును మహాత్మాగాంధీ మనువడు అరుణ్‌గాంధీ, మునిమనుమడు తుషార్‌గాంధీ చేతుల మీదుగా ప్రకాష్ అందుకున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం చేపట్టిన జలవనరుల అభివృద్ధిలో భాగంగా ప్రకాష్ చేసిన విశేషకృషికి ఈ అవార్డు దక్కింది. వాటర్‌మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ సారధ్యంలోని తరుణ్ భారత్ సంఘ్ పర్యావరణ సంరక్షక్ అవార్డుకు ప్రకాష్ ఎంపిక కాగా ఆయనతో పాటు ప్రకాష్ సతీమణి కూడా ఈ సందర్బంగా రాజేంద్రసింగ్ సన్మానించారు. రాజస్తాన్‌లో జరిగిన కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖ పర్యావరణ వేత్తలు జలవనరుల సంరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అదికారులు హాజరుకాగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు నీటి సంరక్షణ పథకాలపై ప్రకాష్ ప్రసంగించారు. ప్రకాష్‌కు ఈ అవార్డు దక్కడం పట్ల జయశంకర్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.