తెలంగాణ

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈమేరకు భట్టివిక్రమర్కను సీఎల్‌పీ నేతగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠత నెలకొన్న సంగతి తెలిసిందే. రాహుల్ ఆదేశం మేరకు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలోనే కాంగ్రెస్ వర్గాలు గొడవపడ్డాయి. సీఎల్‌పీ నాయకుడి ఎంపికపై పార్టీ శాసన సభ్యులు, ఇతర నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఈ అంశాన్ని రాహుల్ గాంధీ నిర్ణయానికి వదలివేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సీఎల్‌పీ నాయకుడుగా ఎంపిక చేయడాన్ని పలువురు శాసన సభ్యులతోపాటు పీసీసీ సీనియర్ నాయకులు సైతం వ్యతిరేకించారు. వేణుగోపాల్ ఢిల్లీకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీకి తెలంగాణ లెజిస్లేచర్ పార్టీలో నెలకొన్న వివాదాల గురించి వివరించారు. మొత్తం పరిస్థితిని సమీక్షించిన పార్టీ అధినేత ఎస్‌సీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, శాసన సభ్యుడు మల్లు భట్టివిక్రమార్కను ఎంపిక చేశారు.