తెలంగాణ

కారెక్కిన వంటేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ వంటేరు 2009 నుంచి పదేళ్ళ పాటు పోరాటం చేసి ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని అన్నారు. బీజేపీ అంటే బిల్డప్ జాతీయ పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీది బిల్డప్ మాత్రమేనని, పైన పటారం..లోన లొటారం అని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 103 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసినా కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాజిక్ ఫిగర్‌కు చేరుకోలేరని ఆయన తెలిపారు. తమకు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ఇటలీ మాఫియా అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతోనే జత కట్టారని విమర్శించారు. కేసీఆర్‌పై అక్కసుతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని అన్నారు. ఆంధ్రపై గద్దల్లా వాలింది ఎవరు? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బూచిలా చూపి ప్రజలను గందరగోళ పరుస్తున్నది ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము అడ్డుకాదని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో తెలంగాణలోని సెటిలర్లు కేసీఆర్‌కు జైకొట్టారని గుర్తు చేశారు.

కేసీఆర్‌తో విభేదాల్లేవు
అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ టీఆర్‌ఎస్‌కు విజయాన్ని చేకూర్చాయని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్, వేముల ఘాట్ రైతులు కూడా టీఆర్‌ఎస్‌కే ఓటు వేశారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు వ్యక్తిగతంగా విభేదాలు ఏమీ లేవని అన్నారు. ముఖ్యమంత్రి తనకు ఎటువంటి బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని ఆయన చెప్పారు. 2009, 2014, 2018లో తనను టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించినా చేరలేదని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్యాంపు ఆఫీసులో వంటేరు ప్రతాప్‌రెడ్డి కలిసి కొంతసేపు చర్చించారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా సక్రమంగా నిర్వహిస్తానని ఆయన తెలిపారు.