తెలంగాణ

పంటలకు పండగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: వచ్చే ఐదేళ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.2.25 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై శుక్రవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడానికి మించిన ప్రాధాన్యత మరొకటి లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని, బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పటి వరకు రూ.77.777 కోట్లు ఖర్చు చేశామన్నారు. భూ సేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, ఆర్‌ఆఱ్ ప్యాకేజిలకు మరో రూ.22 వేల కోట్లు ఖర్చు చేయడంతో మొత్తంగా రూ.99.643 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి మరో రూ. 7 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు సీఎం వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం వరకు రూ.1.07 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులతో పాటు మిషన్ కాకతీయ పనుల కోసం మరో లక్ష 17 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ లక్ష్య సాధన కోసం అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలు కృషి చేయాలన్నారు. ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులు ఓ జోక్‌గా మారాయన్నారు. ఎన్నికలప్పుడు ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లు దండుకోవడమే తప్ప ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు ఇవ్వలేదన్నారు. అత్యధిక వర్షపాతం, పుష్కలమైన నీటి లభ్యతా కలిగిన ఆదిలాబాద్ జిల్లా చరిత్రను
మార్చాలన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు, బ్యారేజి నిర్మించి 2 లక్షల ఎకరాలకు నీరు అందించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు అందించడానికి సమగ్ర వ్యూహం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పెన్‌గంగ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చనఖా-కోరటా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలన్నారు. కుప్టి రిజర్వాయర్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా గోదావరి బేసిన్‌లో తెలంగాణకున్న వాటాను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. ఇటీవల గోదావరిపై నిర్మిస్తోన్న ప్రాజెక్టుల పనులను స్వయంగా పరిశీలించడంతో పూర్తి అవగాహన వచ్చిందన్నారు. ఫిబ్రవరిలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నట్టు సీఎం వెల్లడించారు. అదే నెలలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వర్షాకాలం వచ్చే వరకు పనులు వేగంగా జరగాలన్నారు. నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టుల నీటిని మొదట చెరువులకు మళ్లించాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్ మానేరు నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పి వరకు, ఇటు మల్లన్నసాగర్ వరకు నీరు అందుతుందన్నారు. ఈ నీటిని మొదట చెరువులు నింపటానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ వరకు చెరువులు నింపాలని ఆదేశించారు.