తెలంగాణ

25 నుంచి లిటరరీ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ నెల 25 నుండి 27 వరకూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్టు పర్యాటక శాఖ కార్యదర్శి బి వెంకటేశం చెప్పారు. ఈసారి చైనా నుంచి ఆతిథ్య బృందం హాజరవుతుందని, 8 మంది రచయితలు, కళాకారులు, చర్చావేదికల్లో పాల్గొంటారని అన్నారు. ఆస్ట్రేలియా నుండి అండ్రూ కొలిస్టెర్ నాయకత్వంలోని 8 మంది సభ్యుల బృందం, గుజరాత్ నుండి మహేందర్‌సిన్హా పర్మార్ నాయకత్వంలోని ప్రతినిధి బృందం వస్తోందని చెప్పారు. మృణాళిని సారాభాయ్, కైఫి అజ్మీలకు స్మారక కార్యక్రమాలు ఉంటాయని, మహాత్మాగాంధీని స్మరిస్తూ ప్రత్యేక కార్య క్రమాలు జరుగుతాయని చెప్పారు. కావ్యధార పేరుతో కవితాకథనం, ప్రదర్శన ఉంటుందని తెలిపారు. రంగస్థల ఉపన్యాసాలు, ప్రదర్శనలు, కళాకారుల ప్రతిభాపాటవాలను ప్రదర్శించే అవకాశం ఇవ్వనున్నామని అన్నారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కామెరూన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, పోర్చుగల్, యూకే, యూఎస్‌ఏ నుండి కూడా రచయితలు పాల్గొంటున్నారని , వందకు పైగా ప్రసిద్ధ కళాకారులు హాజరవుతున్నారని చెప్పారు. అనంతరం ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.