తెలంగాణ

వచ్చేనెలలో మాదిగల విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 18: ఫిబ్రవరిలో నిర్వహించనున్న మాదిగల విశ్వరూప మహాసభ నాటికి ఏపీలో పార్టీల నిజ స్వరూపం తేలనుందని, మాదిగల పట్ల పార్టీల కుట్రపూరిత వ్యవహారం బయటపడుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. విభజన అనంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల ఉనికిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన మందా కృష్ణ మాదిగ స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడారు. ఏపీలో స్వార్ధపరుల వత్తిడికి తలొగ్గిన కొన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఎస్సీ వర్గీకరణ పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఏపీలో మాదిగలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎక్కడైతే మాదిగల ఉనికిని రాజకీయ పార్టీలు స్వార్ధపూరితం చేస్తున్నాయో, అక్కడే తామేంటో చూపించడానికి ఫిబ్రవరి 19న అమరావతిలో మాదిగల విశ్వరూప మహాసభ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. ఏపీలో మాదిగలు లేరనే వాదనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.