తెలంగాణ

దేశానికే ఆదర్శంగా సికింద్రాబాద్ జోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: దేశంలో అభివృద్ధి చెందుతున్న రైల్వే జోన్ల ప్రగతిని పరిశీలిస్తే సికింద్రాబాద్ జోన్ ఆదర్శంగా నిలిచిందని బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. రైల్వేబోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన శుక్రవారం మొదటిసారి సికింద్రాబాద్ రైల్వేజోన్ సందర్శించారు. దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లోని ఉద్యోగులు, కార్మికులు అద్భుతమైన పని, సంస్కృతి వల్ల ఈ ఖ్యాతి దక్కిందని అన్నారు. దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ కులశ్రేష్ఠి మాట్లాడుతూ ప్రగతిశీల నాయకత్వ లక్షణాలు ఉన్న బోర్డు చైర్మన్ సేవలు భారతీయ రైల్వేకు అమూల్యమైనవని కొనియాడారు. తెలంగాణలో వివిధ రైల్వేస్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్లను రిమోట్‌తో ప్రారంభించారు. సిరిపూర్ కాగజ్‌నగర్ రైల్వే ష్టేషన్‌లో 10 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల,బెల్లంపల్లి, రామగుండం రైల్వే స్టేషన్లలో 80 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే కార్మిక సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు.