తెలంగాణ

నిగర్వి, వినయశీలి.. పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి నిగర్వి, వినయశీలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కొనియాడారు. శుక్రవారం నాడు శాసనసభలో స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రకటించగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పోచారం వ్యవసాయ మంత్రిగానూ, ఉద్యమకాలంలోనూ చేసిన సేవలను కొనియాడారు. పోచారం ఎన్నిక ఉద్విగ్నపూర్వకంగా ఉందని, వ్యక్తిగతంగా తనకు ఆనందగా, సంతోషంగా ఉందని అన్నారు. ఏకగ్రీవం చేయాలని విపక్ష నేతలు ఉత్తమకుమార్ రెడ్డిని, డాక్టర్ కే లక్ష్మణ్‌ను, అసదుద్దీన్ ఓవైసీని తాను కోరానని, దానికి వారు సహృదయంతో సహకరించారని అన్నారు. 1977లో సింగిల్ విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పోచారం అనేక మెట్లు అధిగమిస్తూ ఆరుమార్లు శాసనసభకు ఎన్నికయ్యారని అన్నారు. వ్యవసాయ మంత్రిగా పోచారం హయాంలో తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని, పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. వ్యవసాయ మంత్రిగా ఆయన పనిచేసిన సమయాన్ని తాను మరిచిపోలేనని, అన్నీ మంచి పనులు జరిగాయని, రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని అన్నారు. పోచారం కాలుమోపిన వేళా విశేషం బాగుందని, కనుక వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బంధు పథకం లాంటివి అనేక రాష్ట్రాలు అమలుచేస్తున్నాయని, వ్యవసాయ రంగంలో రాష్ట్భ్రావృద్ధికి కారణం పోచారం కృషియే నని అన్నారు. పోచారం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టారని, ఇటీవల స్వయంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ , బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు కూడా తెలంగాణ పథకాలు అమలుచేస్తున్నట్టు చెప్పారని అన్నారు.
నిత్యవిద్యార్థి పోచారం
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ట్రం చేసుకున్న అదృష్టమని అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ఇది శుభపరిణామమని అన్నారు. రైతులంతా సంబురపడుతున్నారని ఆయన చెప్పారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ ఆయనకు స్వయంగా లక్ష్మీపుత్రుడని నామకరణం చేశారని, రెండో హరిత విప్లవం పోచారం వ్యవసాయ మంత్రిగా ఉన్నపుడే బీజం పడిందని అన్నారు. 17వేల కోట్ల రైతు రుణ మాఫీ, 58 లక్షల మంది రైతులకు రైతుబంధు , 38 లక్షల మంది రైతులకు రైతుబీమా ద్వారా భరోసా కల్పించారని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత కరెంట్ ఇచ్చి రైతు కుటుంబాల్లో సంతోషాన్ని నింపారని అన్నారు.
పోచారంను ప్రశంసిస్తూ ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్‌రావు, గండ్ర వెంకటరమణ, హోం మంత్రి మొహమూద్ అలీ, బలాలా, బీ శ్రీ్ధర్‌బాబు, పద్మా దేవేందర్‌రెడ్డి, వి శ్రీనివాసగౌడ్, నోముల నర్సింహయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గాదరి కిశోర్, గణేష్‌గుప్త, పువ్వాడ అజయ్‌కుమార్, గంప గోవర్థన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్, బీఎస్ రెడ్యానాయక్, ఇంద్రకరణ్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, ఏ జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎం యాదగిరి రెడ్డి మాట్లాడారు.
గవర్నర్ నరసింహన్‌తో కొత్త స్పీకర్ భేటీ
గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను నూతనంగా ఎన్నికైన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. స్పీకర్ పోచారం తన కుటుంబ సభ్యులతో శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్ళారు. గవర్నర్ నరసింహన్‌కు పోచారం పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్ పోచారం భార్య పుష్ప గవర్నర్ సతీమణికి పుష్పగుచ్చం అందజేశారు. ఆ తర్వాత అరగంట పాటు వారు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలనుద్ధేశించి ప్రసంగించేందుకు శనివారం అసెంబ్లీకి రావాల్సిందిగా స్పీకర్ గవర్నర్‌ను కోరారు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణారావు
కూకట్‌పల్లి నుండి టీఆర్‌ఎస్ పక్షాన శాసనసభ్యుడిగా ఎన్నికైన మాధవరం కృష్ణారావు శాసనసభ్యుడిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.