తెలంగాణ

2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ప్రభుత్వ రంగ సంస్థలో కేంద్రం తన వాటాను తగ్గించుకుంటూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం దుర్మార్గ చర్యగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అభివర్ణించారు. దీనిపై కేంద్రం పునరాలోచించుకోవాలని శుక్రవారం ఇక్కడ డిమాండ్ చేశారు. దేశ రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమల్లో ప్రైవేట్ పెట్టబడులను ప్రోత్సహించడం తొందరపాటు చర్యగా ఆయన చెప్పారు. ప్రధాని మోదీ దుందుడుగు చర్యలతో రానున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూమ్ భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి సురవరం మీడియాతో మాట్లాడారు. దేశ రక్షణ పరికరాలను తయారీ బాధ్యత ప్రైవేటు సంస్థలకు అప్పగించడం దారుణమని ఆయన అన్నారు.ఇది భవిష్యత్‌లో ప్రమాదాలను కొనితెచ్చుకోవడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర చర్యలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల్లో పని చేస్తున్న కార్మికులు సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమ్మెలో దాదాపు4 లక్షల మంది కార్మికులు పాల్గొంటారని వెల్లడించారు. ఈనెల 23 నుంచి 26 వరకూ సమ్మె జరుగుతుందని తెలిపారు. విదేశీ సంస్థలకు రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమల్లో భాగస్వామ్యం కల్పిస్తే కార్మికుల భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. సీబీఐలో నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని లేని పక్షంలో దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. కాగా అలోక్‌వర్మపై కేంద్ర కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కేరళ అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశంపై బీజేపీ మతోన్మాదులను ప్రోత్సహించడం దారుణమన్నారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌పై 12 వందల పేజీలతో నేరారోపణలతో చార్జిషీట్ దాఖలు చేయడం అన్యాయమని సురవరం చెప్పారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయని, దీనికి భయపడి మోదీ తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరొక న్యాయమా ? అంటూ చాడ వెంకటరెడ్డి నిలదీశారు. ఫెడరల్ ఫ్రంట్‌కు వైఎస్సాఆర్ పార్టీ మద్దతు కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేయడాన్ని చాడ తప్పుపట్టారు. కాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక కావడం పట్ల వెంకటరెడ్డి అభినందించారు.