తెలంగాణ

కేటీపీపీకి చేరిన జిందాల్ రూటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణఫురం, జనవరి 18: ఎట్టకేలకు నెల రోజుల అనంతరం జిందాల్ సంస్థతో జెన్‌కో ప్రతినిధుల చర్చలు సఫలం కావడంతో చత్తీస్‌గఢ్ నుండి జయశంకర్ జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో ఉన్న కేటీపీపీకి భారీ కంటైనర్‌లో శుక్రవారం రూటర్‌ను తెప్పించారు. కేటీపీపీ రెండవ దశ 600ల మెగావాట్ల ప్లాంటులో రూటర్ పగిలిపోయి సుమారు నెల రోజులు దాటింది. పగిలిన రూటర్ మరమ్మతుల కోసం జెన్‌కో అధికారులు హరిద్వార్‌కు తరలించిన విషయం తెలిసిందే. మరమ్మతు పనులకు కనీసం 3 నెలలు పట్టే అవకాశం ఉండటంతో జెన్‌కో యాజమాన్యం ప్రత్యామ్నాయంగా జిందాల్ సంస్థతో చర్చలు జరిపింది. ప్రస్తుతం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌లో విద్యుత్ ప్లాంటును జిందాల్ నిర్మిస్తోంది. వారి వద్ద అందుబాటులో ఉన్న రూటర్‌ను కేటీపీపీకి తెప్పించడంలో జెన్‌కో యాజమాన్యం సఫలీకృతమైంది. జిందాల్ సంస్థకు రూటర్‌తో ప్రస్తుతం అవసరం లేకపోవడంతో జెన్‌కోకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. భారీ కంటైనర్‌లో 5 రోజుల క్రితం బయలుదేరిన రూటర్ శుక్రవారం ఉదయం కేటీపీపీకి చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం నుండి రూటర్ బిగింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. నెల రోజులుగా కొనసాగుతున్న వార్షిక మరమ్మతు పనుల్లో కూడా వేగం పెరగనుంది.