తెలంగాణ

పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 18: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందెన్నడు లేని రీతిలో సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. మొదటి విడతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 90సర్పంచ్ స్థానాలు, 1188వార్డు స్థానాలు ఏకగ్రీవమవ్వగా, రెండో విడతలో 97సర్పంచ్ స్థానాలు, 990వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన వాటిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లే మెజార్టీగా ఉన్నారు. చిన్న పంచాయతీలు, తండాల్లో ఏకగ్రీవాలు అధికంగా సాగగా ఎక్కువగా డబ్బుతో పాటు భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాల కల్పన హామీలతో పాటు ఊరి అభివృద్ధికి నిధులిస్తామంటు ఒప్పందాల నేపధ్యంలోనే సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సంపన్న వర్గాలకు చెందిన వారే పంచాయతీ పోరులోను, ఏకగ్రీవాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది. 500ఓట్లు ఉన్న తండాలు, చిన్న పంచాయతీల్లోనూ 10నుండి 20లక్షల మేరకు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామన్న హామీలతో సర్పంచ్ పదవులు దక్కించుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగే పంచాయతీల పరిధిలో సర్పంచ్ స్థానాలకు లక్షలు దాటి కోట్లు ఖర్చు చేసే దిశగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల హోరాహోరీకి నిదర్శనంగా కనిపిస్తుంది.
21న మొదటి విడత పోలింగ్
మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈనెల 21న నిర్వహించనున్నారు. మొదటి విడతలో నల్లగొండ జిల్లాలో 52 సర్పంచ్‌లు, 655 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 52సర్పంచ్ స్థానాలకు 666మంది, 1914వార్డులకు 4281మంది బరిలో ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 16సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 292వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 145 సర్పంచ్ స్థానాలకు 426మంది అభ్యర్థులు, 1162వార్డు స్థానాలకు 2574మంది పోటీలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 22మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంకాగా, 241వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 102సర్పంచ్ స్థానాలకు 298మంది అభ్యర్థులు, 809 వార్డు స్థానాలకు 1944మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రెండో విడత పోలింగ్ ఈనెల 25న జరుగనుండగా, నల్లగొండ జిల్లాలో దేవరకొండ డివిజన్‌లోఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో 52సర్పంచ్ స్థానాలు, 585 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 224సర్పంచ్‌లకు 678మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1786వార్డులకు 4125 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 29 సర్పంచ్ స్థానాలు, 250వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 131సర్పంచ్ స్థానాల్లో 345మంది, 1212వార్డు స్థానాలకు 2669 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడతలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 113 సర్పంచ్ స్థానాలకు, 999 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
మూడో విడతకు ముగిసిన నామినేషన్లు
ఈనెల 30వ తేదిన పోలింగ్ జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దాఖలు ఘట్టం శుక్రవారంతో ముగిసింది. నల్లగొండ జిల్లాలో మూడో విడతలో 257సర్పంచ్‌లకు, 2322వార్డులకు, సూర్యాపేట జిల్లాలో 154సర్పంచ్‌లకు, 11404వార్డులకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 148సర్పంచ్‌లకు, 1248వార్డు స్థానాలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. 22న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సాగుతుంది.

ముగిసిన మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

కొత్తగూడెం, జనవరి 18: భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరాహోరీగా సాగుతున్నాయి. మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేయడంతో శుక్రవారంతో మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు గ్రామాలలో మకాంవేసి తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రధానంగా ఏకగ్రీవ ఎన్నికల కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన్నప్పటికీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 22గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా రెండవ విడత ఎన్నికలలో 20 పంచాయతీలతో సరిపెట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 475 పంచాయతీలను మూడువిడతలుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మొదటి విడత జిల్లాలోని 7 మండలాల్లో 174 పంచాయతీల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 7న ప్రారంభంకాగా ఎన్నికల పోలింగ్ నిర్వహణ ఈనెల 21న జరుగుతుండగా రెండవ విడత 7 మండలాల్లోని 142 పంచాయతీల్లో ఈనెల 24న ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ విడత పంచాయతీల సర్పంచ్‌ల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియగా 30న ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ల విత్‌డ్రాస్ ముగిసిన 14 మండలాల్లోని 210 పంచాయతీల్లో ఎన్నికల ప్రచార హోరు హోరాహోరీగా సాగుతోంది. ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ రాజకీయ వాతవరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన అభ్యర్థులకు సర్పంచ్‌లు రిజర్వుకావడంతో ఉపసర్పంచ్‌ల పదవులకు డిమాండ్ పెరగడంతో అధికశాతం మంది రాజకీయ పార్టీల నాయకులు వార్డుమెంబర్లుగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అమాయక గిరిజనులను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి ఉపసర్పంచ్ పదవిని చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడంతో వార్డుమెంబర్లకు డిమాండ్ పెరుగుతోంది. నూతనంగా ఏర్పడ్డ పంచాయతీలతో కొత్త నాయకత్వం, పరిపాలన త్వరలో సాగే పరిస్థితి నెలకొనడంతో సీనియర్ నాయకులే పదవులను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నాయకులు ఆర్థికంగా, కులపరంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపారు. సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థి సుమారు 5లక్షల రూపాయల వరకు ఖర్చుపెట్టే స్థోమత ఉన్న వారికే పార్టీలు ఎన్నికల బరిలో దింపగా, వార్డుమెంబర్లు సైతం కులాల వారీగా విభజించి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలో కులప్రాధాన్యత పంచాయతీ ఎన్నికలలో అధికంగా కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో పాగావేసేందుకు నాయకులు తీవ్రంగా శ్రమిస్తూ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పోటాపోటీగా ప్రణాళికలు రూపొందిస్తూ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.