తెలంగాణ

నేటి పట్నం వారంతో కొమురెళ్లి మల్లన్న జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, జనవరి 19: ప్రముఖ శైవక్షేత్రమైన సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జునస్వామి జాతర నేటి పట్నం వారంతో ప్రారంభంకానుంది. స్వామివారి కళ్యాణంతో పాటు సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామివారి జాతర ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం నుంచి ఉగాది వరకు మూడు నెలలపాటు జాతర సాగనుంది. అందులో భాగంగా నేటి నుండి ప్రారంభమయ్యే జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి భక్తులు ఈ వారానికి రావడం వల్ల దీనిని పట్నం వారంగా పిలవడం జరుగుతుంది. శనివారం సాయంత్రానికే భక్తులు పెద్ద సంఖ్యలో కొమురవెళ్లికి చేరుకున్నారు. ముందుగా స్వామివారిని భక్తులు దూళి దర్శనం చేసుకుంటారు. ఆదివారం పట్నాలు వేసి మొక్కులు తీర్చుకొని కొండపై కొలువైన ఎల్లమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించుకుంటారు. సోమవారం పట్నం నుండి వచ్చిన యాదవ భక్తుల ఆధ్వర్యంలో పట్నం వేసి తిరుగు పయనమవుతారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఇవో వెంకటేశ్, కమిటి చైర్మన్ సేవెల్లి సంపత్‌తో పాటు కమిటి సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా శాంతిభద్రతల విషయంలో విఘాతం కలుగకుండా బందోబస్తులు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్, ఏసీపీ మహేందర్‌లు తెలిపారు.

చిత్రం..కొమురెళ్లి మల్లన్న జాతరకు తరలి వస్తున్న భక్తులు