తెలంగాణ

పక్షం రోజులకోసారి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పి) సమావేశాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించనున్నట్లు సీఎల్‌పి నూతన నాయకుడు, ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఆదివారం అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భట్టివిక్రమార్కను సీఎల్‌పి నేతగా ప్రకటించారు. ఇలాఉండగా భట్టివిక్రమార్క అసెంబ్లీ ఆవరణలోని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎల్‌పి సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా ప్రజా సమస్యలపై చర్చించి, అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టులపై లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, ఇంత వరకు ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని అన్నారు. ఈ నిధులపై అర్థవంతమైన చర్చ జరగాలని, సాంకేతిక నిపుణులతో ప్రాజెక్టులను సందర్శిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై నిర్మాణాత్మకమైన పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో రెండేళ్ళుగా ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని భట్టివిక్రమార్క అన్నారు.