తెలంగాణ

ఆపరేషన్ లేకుండా అపోలోలో అరుదైన చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: అపోలో హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ లేకుండా అరుదైన చికిత్స నిర్వహించారు. దేశంలో మొదటి సారి శస్త్ర చికిత్స అవసరం లేకుండా ఐదు దెబ్బతిన్న హార్ట్ వాల్స్‌లను ట్రాన్స్ క్యాథటర్ అరోటిక్ వాల్స్ రిప్లేస్‌మెంట్ పద్ధతి ద్వారా అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్‌లో కార్డియాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. శ్రీనివాస్ కుమార్ నాయకత్వంలో కార్డియాలజిస్టుల బృందం నిర్వహించింది. వాల్స్ డిసీజ్‌తో బాధపడుతూ అనారోగ్యానికి గురైన ఐదుగురు రోగులకు టీఎవిఆర్ పద్ధతిన నిర్వహించినట్లు డాక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపారు. వాల్వ్ భర్తీకి ఓపెన్ హార్ట్ శస్త్ర చికిత్సను నిర్వహించేందుకు ఆరోగ్యపరంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురికి చికిత్స నిర్వహించి, రెండో రోజున డిశ్చార్జీ చేసినట్లు ఆయన చెప్పారు.