తెలంగాణ

ఇదేం పాలన, ఇవేం మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ చట్ట సభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగం అనంతరం ప్రభుత్వం ఇచ్చిన జవాబు చూస్తుంటే జవాబుదారీతనం కనిపించడం లేదని, ఇదేం పాలన అనిపిస్తోందని ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాటలు వింటుంటే బీజేపీ కొన్ని ప్రశ్నలు వేయదల్చుకుందని చెప్పారు. గవర్నర్ ప్రసంగం వింటే చాలా నిరాశ పరిస్థితి కనిపించిందని అన్నారు. నిరుద్యోగ సమస్యపై గవర్నర్ ప్రసంగంపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. లక్షకు పైగా ఖాళీల భర్తీకి సంబంధించి ఎన్నో మాటలు చెప్పిన ప్రభుత్వం దానిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలతో కలుపుకుని ఇంత వరకూ భర్తీ చేసింది కేవలం 30వేల పోస్టులేనని, ఇంకా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నాలుగేళ్లలో అనేక మంది రిటైరయ్యారని ఆ పోస్టులను కూడా గణించి భర్తీ చేయాల్సిన ప్రభుత్వం దానిపై మాట్లాడలేదంటే ఈ నిరుద్యోగ సమస్యను ఇలానే ప్రభుత్వం ఉంచదల్చుకుందా అని ఆయన నిలదీశారు. సోమవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ బాధ్యత ఉన్న జాతీయ పార్టీగా తమ వంతు సానుకూల మద్దతు ఇస్తామని, సద్విమర్శ కూడా చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆశయాల కోసం హుందాగా టీఆర్‌ఎస్ పనిచేయాలని సూచించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక క్యాలండర్ విడుదల చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. వేలకు వేలు వెచ్చించి విద్యార్థులు శిక్షణ పొందుతూ ఆశతో ఉన్నారని, వారి ఆశలను భంగం చేయకుండా ప్రభుత్వం ఉద్యోగాల క్యాలండర్ ఇవ్వాలని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిపై కూడా ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు లక్షలాది మంది ఉన్నారని, మార్గదర్శకాలు ఇచ్చి ఉంటే వారికి ఒక స్పష్టత వచ్చేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని సూచించారు. విద్యారంగంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, వర్శిటీల్లో దాదాపు 2వేలకు పైగా బోధన పోస్టులు ఐదేళ్లుగా ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం వీటి భర్తీలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. 3వేలకు పైగా నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటి గురించి ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదని ఆరోపించారు. వర్శిటీల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన సూచించారు.
రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనాలు ఇస్తామని చెప్పిందని, రైతు సమన్వయ సమితుల్లో ఉన్నది కూడా టీఆర్‌ఎస్ నేతలేనని, చట్టబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నా సమాంతరంగా సమన్వయ సమితుల వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసిందో నేటికీ ప్రభుత్వం చెప్పలేకపోతోందని అన్నారు. ఎలాంటి చట్టబద్ధత లేని రైతు సమన్వయ సమితులకు బడ్జెట్ నుండి ఎలా నిధులు కేటాయిస్తారో కూడా చెప్పలేకపోతోందని రామచందర్‌రావు నిలదీశారు.

చిత్రం..ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు