తెలంగాణ

ఎన్నికల కమిషన్ వైఫల్యాలపై 24న ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ఎన్నికల కమీషన్ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 24న ధర్నా చేయనున్నట్టు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం గాంధీభవన్‌లో కమిటీ సమావేశమైంది. అనంతరం మర్రి శశీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలన్న కుట్రతోనే ఎన్నికల కమీషన్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో కుమ్మక్కైందని ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో దాదాపు 25 లక్షల మంది ఓట్లు గల్లంతు కావడం పట్ల సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ ప్రజలను క్షమాపణ కోరారని శశీధర్‌రెడ్డి గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే ఒక ఎన్నికల అధికారి తప్పులు జరిగాయని క్షమాపణ చెప్పడం ఇదే మొదటిసారని శశీధర్‌రెడ్డి అన్నారు. ఓట్ల గల్లంతుకు క్షమాపణ చెబితే సరిపోదని, దీనికి బాధ్యులైన అధికారులపై చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని తాము పార్టీ తరఫున ఎన్నిసార్లు ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఓటర్ల తొలగింపు అనేది కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కాలేదని, దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్ధితి అన్నారు. మొత్తం ఓటర్లలో దాదాపు 12 శాతం ఓటర్ల తొలగింపు జరిగిందన్నారు. ఎన్నికల కమీషన్ చివరి వరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుచుకుందని శశీధర్‌రెడ్డి ఆరోపించారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన దాని కంటే ఓట్ల లెక్కింపులో ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ గడువు ముగియడానికి గంట ముందు అత్యధికంగా పొలింగ్ జరిగిందన్నారు. ఓటర్ల జాబితా మొదలుకొని ఎన్నికల ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల కమీషన్ తప్పులు చేసిందని శశీధర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమీషన్ వైఫల్యాలను ఎండగడుతూ 24న టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
చిత్రం..సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న
పీసీసీ ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి